Sharwanand: వైభవంగా యంగ్ హీరో వివాహ నిశ్చితార్థం
NQ Staff - January 26, 2023 / 01:25 PM IST

Sharwanand : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ పెళ్లికి రెడీ అయ్యాడు. గత కొన్ని రోజులుగా శర్వానంద్ పెళ్లి ఫిక్స్ అయిందనే వార్తలు మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్న విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమే అన్నట్లుగా శర్వానంద్ యొక్క వివాహ నిశ్చితార్థం నేడు వైభవంగా జరిగింది.
గురువారం ఉదయం హైదరాబాదులోని ఒక హోటల్లో జరిగిన ఈ వేడుకలో శర్వానంద్ మిత్రుడు రామ్ చరణ్ సతీసమేతంగా పాల్గొన్నారు. శర్వానంద్ కి పెద్ద ఎత్తున మిత్రులు అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు శుభాకాంక్షలు తెలియజేశారు.

Sharwanand Rakshitha Reddy Wedding Engagement Took Place Grand Manner Today
శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పేరు రక్షితా రెడ్డి. ఈమె కుటుంబ చాలా సంవత్సరాల క్రితమే అమెరికాలో సెటిల్ అయ్యిందట. రక్షితా కూడా అమెరికాలోని ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారట.
ఇక శర్వానంద్ సినిమాల విషయాకి వస్తే ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుండి కూడా నటుడిగా తనను తాను నిరూపించుకునే విధంగా సినిమాలు చేస్తూ వచ్చాడు. హీరోగా మంచి సినిమాలు చేసిన శర్వానంద్ కమర్షియల్ సినిమాల కంటే కూడా మంచి కంటెంట్ సినిమాలు చేసి మెప్పించాడు.