Sharwanand : శర్వానంద్ హీరోగా, పొలిటికల్ కామెడీ చిత్రం.!

NQ Staff - July 22, 2022 / 05:00 AM IST

Sharwanand : శర్వానంద్ హీరోగా, పొలిటికల్ కామెడీ చిత్రం.!

Sharwanand : పొలిటికల్ కామెడీ సినిమా అనాలా.? సెటైరికల్ పొలిటికల్ మూవీ అనుకోవాలా.? ఏదైనా అనుకోండి.. యంగ్ హీరో శర్వానంద్ కొత్త సినిమాకి ఒకింత ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఖాయమైంది. సినీ దర్శకుడిగా మారిన పాటల రచయిత కృష్ణ చైతన్య ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు.

Sharwanand political drama movie

Sharwanand political drama movie

శర్వానంద్ సరసన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించనుండగా, ప్రియమణి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది. జయరామ్, రావు రమేష్ ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం.

గోదావరి రాజకీయం.!

గోదావరి నేటివిటీతో, ఎంటర్టైన్మెంట్‌తో కూడిన పొలిటికల్ సినిమా అట ఇది. ఇంకా ఈ సినిమాకి టైటిల్ ఖరారవలేదు. కాగా, యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

గోదావరి నేటివిటీ అంటే శర్వానంద్‌కి ఒకరకంగా కొట్టిన పిండి అనుకోవాలేమో. ఓ సాధారణ యువకుడి పాత్రలో ఈ సినిమాలో శర్వానంద్ కనిపించబోతున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతోందట.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us