Sharwanand : టీడీపీ నేత మనవరాలితో శర్వానంద్ పెండ్లి.. మ్యారేజ్ డేట్ ఫిక్స్..!
NQ Staff - January 25, 2023 / 09:59 AM IST

Sharwanand : ఈ నడుమ సెలబ్రిటీలు వరుసగా పెండ్లి పీటలు ఎక్కుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు పెండ్లికి రెడీ అవుతూ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెబుతున్నారు. అయితే తాజాగా శర్వానంద్ వంతు వచ్చింది. ఆయన పెండ్లి గురించి గత కొంతకాలంగా ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. ఈ బ్యాచిలర్ హీరో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 15 ఏండ్లు దాటిపోతోంది. కానీ ఇంకా పెండ్లి చేసుకోలేదు.
క్లారిటీ వచ్చేసింది..
అయితే ఇన్ని రోజులు ఆయన గురించి ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంది. పలానా హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడని, ఆ అమ్మాయిని పెండ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇవన్నీ ఫేక్ అని ఎప్పటికప్పుడు నిరూపితం అవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఆయన పెండ్లిపై ఓ క్లారిటీ వచ్చేసింది.
శర్వానంద్‌కు పెండ్లి ఫిక్స్ అయిపోయింది. ఎవరితోనో కాదండోయ్.. ఓ రాజకీయ నేత మనవరాలితో అని తెలుస్తోంది. ఆ అమ్మాయి పేరు రక్షిత రెడ్డి. ఆమె అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. రక్షిత రెడ్డి తండ్రి మధుసూదన్ రెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాదిగా పని చేస్తున్నాడు.
మధుసూదన్ రెడ్డి సోదరుడు గంగారెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అల్లుడు. ఆ విధంగా రక్షిత రెడ్డి గోపాలకృష్ణారెడ్డికి మనవరాలు అయ్యిందన్న మాట. ఈ గోపాల కృష్ణారెడ్డి గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పని చేశారు. ఈ నెల 26న వీరి నిశ్చితార్థం జరగనుంది. ఈ సమ్మర్ లో వీరి పెండ్లి అంగరంగ వైభవంగా జరగబోతోంది.