Sharwanand : శర్వానంద్‌కి అన్ని కోట్ల ఆస్తులు వున్నాయా.? షాక్ అవుతున్న నెటిజన్లు.!

NQ Staff - September 8, 2022 / 03:53 PM IST

Sharwanand : శర్వానంద్‌కి అన్ని కోట్ల ఆస్తులు వున్నాయా.? షాక్ అవుతున్న నెటిజన్లు.!

Sharwanand : యంగ్ హీరో శర్వానంద్ గురించి చాలా చాలా తక్కువమందికే తెలుసు. ఆయన వ్యక్తిగత జీవితం, ఆస్తిపాస్తుల గురించి సినీ పరిశ్రమలో కూడా చాలా కొద్దిమందికే తెలుసు. ఎప్పుడూ సరదాగా కనిపించే శర్వానంద్, డౌన్ టు ఎర్త్ వుంటాడు. అదే అతని ప్రత్యేకత.

నిజానికి, శర్వానంద్ సొంతంగా బ్యానర్ పెట్టుకుని భారీ బడ్జెట్ సినిమాలు తీయగల కెపాసిటీ వున్నోడట. హైద్రాబాద్‌లో పావు వంతు శర్వానంద్‌దే.. అనే సెటైర్ కూడా వినిపిస్తుంటుంది సినీ పరిశ్రమలో.

అయ్యో.. మరీ అంత కాదు లెండి..

Sharwanand Family Lot Of Properties

Sharwanand Family Lot Of Properties

ఓ పెద్ద డైరెక్టర్, శర్వానంద్‌తో కలిసి డ్రైవ్‌కి వెళ్ళినప్పుడు, ‘ఆ బిట్టు మనదే.. ఈ స్థలం మనదే..’ అని చాలా వీధుల్లో తిరుగుతూ చెప్పాడట శర్వానంద్. ఈ విషయమై శర్వానంద్ చెబితే, ‘మరీ అది అతిశయోక్తి..’ అని నవ్వేశాడు.

‘ఔను, మా అమ్మ.. నాన్న.. సంపాదించిన ఆస్తులు బాగానే వున్నాయి. కానీ, ఆ ఆస్తుల తాలూకు పొగరు నా తలకెక్కలేదు. నేను మామూలుగానే వుంటాను. సినిమాలంటే నాకు ఇష్టం. కేవలం ఆస్తులతోనే ఆనందం వస్తుందని నేను అనుకోను.. నేను కావాలంటే సొంతంగా సినిమాలు తీసుకోగలను.. కానీ, ఆ ఆలోచనలు వేరేలా వుంటాయ్..’ అని చెప్పాడు శర్వానంద్. ఔనా, మరీ శర్వానంద్ అంత డబ్బున్నోడా.? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us