Sharvanand : డిప్రెషన్‌లోకి నెట్టేసింది.! ‘ఒకే ఒక జీవితం’పై శర్వానంద్ సీరియస్ కామెంట్స్.!

NQ Staff - September 10, 2022 / 10:05 PM IST

Sharvanand : డిప్రెషన్‌లోకి నెట్టేసింది.! ‘ఒకే ఒక జీవితం’పై శర్వానంద్ సీరియస్ కామెంట్స్.!

Sharvanand : విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న శర్వానంద్‌కి ఈ మధ్య వరుస ఫెయిల్యూర్స్ ఇబ్బంది పెట్టాయ్. లేటెస్టుగా ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు శర్వానంద్. భారీ అంచనాలు లేకపోయినా, ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాడు శర్వానంద్.

Sharvanand Oke Oka Jeevitham movie interesting comments

Sharvanand Oke Oka Jeevitham movie interesting comments

ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందింది ఈ సినిమా. మదర్ సెంటిమెంట్ సినిమాకి ప్రాణం. అమల అక్కినేని ఈ సినిమాలో తల్లి పాత్ర పోషించింది. కాగా, తల్లి సెంటిమెంట్ సీన్లలో శర్వానంద్ నటించాడు అనేదానికన్నా, జీవించేశాడు అంటే అతిశయోక్తి కాదేమో.

షూటింగ్ వదిలేసి కౌన్సిలింగ్ తీసుకునేంతలా..

అంతలా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా టైమ్‌లో బాగా డిప్రెషన్‌కి లోనయ్యాడట శర్వానంద్. అంటే మదర్ సెంటిమెంట్ సీన్లు శర్వానంద్‌పై చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాయట. మధ్యలో షూటింగ్ ఆపేసి అమెరికా వెళ్లిపోయాడట కౌన్సిలింగ్ కోసం.

ఇలాంటి సినిమాలు చేయొద్దని డాక్టర్లు సూచించారట శర్వానంద్‌కి. ఇప్పుడీ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయ్. అసలిలాంటి వ్యాఖ్యలు శర్వానంద్ ఎలా చేయగలిగాడు.? అలా చెబితే, ఇలాంటి సినిమాలు ముందు ముందు ఎలా వస్తాయ్.?

ఈ తరహా కంటెంట్‌లో నటించేందుకు నటీనటులు ముందుకొస్తారా.? అంటూ నెటిజన్లు శర్వాని కామెంట్ చేస్తున్నారు. అవును నిజమే, సెంటిమెంట్ సీన్లలో నటించడం అనేది నటీనటులకు చాలా కీలకమైన అంశం. కేవలం నటన మాత్రమే అది. ఆయా సీన్లకు ఆయా నటులు కనెక్ట్ అవ్వొచ్చుగాక. కానీ, శర్వా మాటలు నిజంగానే అనుచితంగా అనిపిస్తున్నాయ్ మరి. ఎందుకిలా మాట్లాడాడో శర్వా.!

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us