Shantanu Hazarika And Shruti Haasan : తల్లి సారిక సాక్షిగా బాయ్‌ఫ్రెండ్‌తో రచ్చ చేసిన శృతి హాసన్.!

NQ Staff - October 7, 2022 / 01:51 PM IST

Shantanu Hazarika And Shruti Haasan : తల్లి సారిక సాక్షిగా బాయ్‌ఫ్రెండ్‌తో రచ్చ చేసిన శృతి హాసన్.!

Shantanu Hazarika And Shruti Haasan : సీజన్స్ వస్తుంటాయ్.. పోతుంటాయ్, మళ్ళీ వస్తుంటాయ్.. మళ్ళీ పోతుంటాయ్.! సెలబ్రిటీల ప్రేమ వ్యవహారాలు కూడా అంతేనా.? సారిక – కమల్ హాసన్.. ఈ జంట గురించి కొత్తగా చెప్పేదేముంది.? సారిక – కమల్ హాసన్ ఎప్పుడో విడిపోయారు. ఆ తర్వాత కమల్ హాసన్, గౌతమితో సహజీవనం.. అవన్నీ తెలిసిన విషయాలే.

తల్లిదండ్రుల్ని యధాతథంగా ఫాలో అవుతున్నట్టున్నారు కుమార్తెలు అక్షర హాసన్, శృతి హాసన్. ఆ మధ్య అక్షర హాసన్ బాయ్ ఫ్రెండ్.. మాజీ అయ్యాక, ఆమె అర్థనగ్న ఫొటోల్ని లీక్ చేయడం అప్పట్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.

తండ్రికి ఓ బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసి.. తల్లికి ఇంకో బాయ్ ఫ్రెండ్‌ని పరిచయం చేసి..
శృతి హాసన్ గతంలో ఓ బాయ్ ఫ్రెండ్‌తో పీకల్లోతు ప్రేమాయణం నడిపింది. వారిద్దరి పెళ్ళి త్వరలో.. అంటూ ప్రచారం కూడా జరిగింది. తండ్రి కమల్ హాసన్ వెంట, తన ప్రియుడ్ని తిప్పింది కూడా. బంధువులకీ పరిచయం చేసింది. కానీ, ఆ కథ త్వరగానే ముగిసిపోయింది.

కొత్త కథ మళ్ళీ మొదలైంది.

ఈసారి బాయ్ ఫ్రెండ్ ఇంకొకరు. అతన్ని తన తల్లికి పరిచయం చేసింది శృతి హాసన్ .తాజాగా సారిక వద్దకు తన కొత్త బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాని తీసుకెళ్ళి రచ్చ రచ్చ చేసింది. ఆ నవ్వులు, ఆ కౌగలింతలు.. అబ్బో.. ఆ హంగామానే వేరు.

ఈ ప్రేమ కూడా సీజన్ లాంటిదేనా, సీజన్ ముగిశాక శృతి జీవితంలోకి కొత్త బాయ్ ఫ్రెండ్ రాబోతున్నాడా.? ఏమో, వచ్చినా రావొచ్చు.

 

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us