Lakshmi Vasudevan : రూ.5 వేల గురించి నటికి వేదింపులు.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్‌

NQ Staff - September 27, 2022 / 04:34 PM IST

Lakshmi Vasudevan : రూ.5 వేల గురించి నటికి వేదింపులు.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్‌

Lakshmi Vasudevan : సైబర్ నేరగాళ్ల వలలో సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు చిక్కుకుంటున్నారు. సామాన్యులు చదువు రాక చిన్న మొత్తం ఆశ చూపడంతో మోస పోతున్నారు. సెలబ్రిటీలు కూడా సైబర్ నేరగాల వలలో పడడం ఆశ్చర్యంగా ఉందంటూ పోలీసులు అభిప్రాయం చేస్తున్నారు.

ఎంతగా సోషల్ మీడియా ద్వారా,

వివిధ మీడియాల ద్వారా సైబర్ నేరాల గురించి హెచ్చరించినా కూడా కొందరు పట్టించుకోకుండా మళ్లీ మళ్లీ మోసపోతూనే ఉన్నారు అంటూ తాజాగా మరో సంఘటన నిరూపించింది.

ప్రముఖ సీరియల్ నటి లక్ష్మీ వాసుదేవన్‌ సైబర్ నేరగాల వలలో చిక్కుకుంది. ఆమె సోషల్ మీడియా ద్వారా తన ఆవేదన వెళ్ళగక్కింది. ఏకంగా కన్నీళ్లు పెట్టుకుంటూ అందరికీ తాను మోసపోయిన విధానంను వివరించి.. తాను ఎంతగా మానసిక క్షోభ అనుభవించిందో చెప్పుకొచ్చింది.

వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం ఆమెకు ఒక మెసేజ్ వచ్చిందట.. ఆ మెసేజ్ లో మీ ఫోన్ నెంబర్‌ పై ఐదు లక్షల రూపాయల లక్కీ మనీ వచ్చిందని, దాన్ని క్లైమ్ చేసుకునేందుకు లింకు క్లిక్ చేయాలంటూ ఒక లింకు ఇవ్వడం జరిగిందట.

ఆ లింక్‌ ని ఆమె క్లిక్ చేయడంతో ఆమెకు తెలియకుండానే ఆమె ఫోన్ లో ఒక యాప్ ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయింది. ఆ వెంటనే ఆమె ఫోన్ హ్యాక్ అయింది. ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ ఫొటోస్ ఇతర వివరాలన్నీ హ్యాకర్స్ దక్కించుకున్నారు.

కొన్ని రోజుల తర్వాత మీరు రూ. 5 వేల లోన్ తీసుకున్నారు.. ఆ లోన్ కట్టాలి అంటూ మెసేజ్ రావడం ప్రారంభమైంది. లోన్ కట్టకపోతే మీ కాంటాక్ట్స్ మెంబర్స్ కి మీ యొక్క బూతు ఫోటోలు మరియు వీడియోలు షేర్ చేస్తాం అంటూ హెచ్చరించారట.

ప్రస్తుతం ఆమెకు ఈ వేధింపులు తప్పడం లేదని.. ఇప్పటికే ఆమె కాంటాక్ట్స్ లో ఉన్న వారికి మార్ఫింగ్ ఫోటోలు పంపి సదరు సైబర్ నేరగాళ్లు ఆమెను వేధిస్తున్నారట. ఇలా మీరు మోసపోకండి అంటూ ఆమె సోషల్ మీడియా ద్వారా సామాన్య జనాలకు సూచించింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us