Senior Actress Jamuna : సీనియర్ నటి జమున ఎన్ని కోట్ల ఆస్తులు కూడబెట్టిందో తెలుసా..?
NQ Staff - January 27, 2023 / 03:55 PM IST

Senior Actress Jamuna : సీనియర్ నటి జమున గురించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఆమె 86 ఏండ్ల వయసులో నేడు ఉదయం ఆమె ఇంట్లో కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో పాటు వయసు భారంతో ఆమె కన్ను మూశారు. అయితే ఆమె మరణించిన తర్వాత ఆమెకు సంబంధించిన విషయాలు బయటకు వస్తున్నాయి. కర్నాటకలోని హంపీలో ఆమె జన్మించారు.
కానీ ఆమె చిన్నతనం మొత్తం గుంటూరులో జరిగింది. నాటకాలపై ఉన్న ఇంట్రెస్ట్ తోనే ఆమె సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, జగ్గయ్య లాంటి అగ్ర హీరోల సరసన నటించింది.
జూబ్లీహిల్స్ లో ఇల్లు..
అయితే ఆమె ఇన్నేండ్ల కెరీర్ లో బాగానే ఆస్తులు కూడబెట్టింది. అప్పట్లో ఆమె డబ్బులను చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంది. సంపాదించిన డబ్బులను మొత్తం ఆస్తులను కొనిపెట్టుకుంది. జూబ్లీహిల్స్ లో ఆమెకు 2వేల గజాల ఇల్లు ఉంది. దాని ఖరీదు రూ.18కోట్లు ఉంటుందని సమాచారం.
అలాగే ఆమెకు హైదరాబాద్ చుట్టు పక్కల 36ఎకరాల భూములు కూడా ఉన్నాయి. వాటి ఖరీదు కొన్ని వందల కోట్లు ఉంటాయని తెలుస్తోంది. ఆమెకు అప్పట్లోనే మూడున్నర కిలోల బంగారం ఉండేది. ఆమెకు ఖరీదైన కార్లు కూడా బాగానే ఉన్నాయి. మొత్తం ఆమె ఆస్తుల విలువ కలిపి రూ.185కోట్లు ఉంటుందని సమాచారం.