Naresh : గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్రల పెళ్లికి సంబంధించిన వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల మహా బలేశ్వరం గుడిలో ఈ జంట దర్శనం ఇవ్వడం.. అక్కడే ఒక స్వామీజీతో తమ పెళ్లి గురించి ప్రస్తావించినట్టుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ ఇద్దరు మూడేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నారనే ప్రచారం జరిగింది.

ఓపెన్ కామెంట్స్..
పవిత్రా లోకేష్ ..సుచేంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లాడగా, కొద్ది రోజుల తర్వాత ఆయనకు విడాకులు ఇచ్చింది. అప్పటి నుండి నరేష్‌తో డేటింగ్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ ముదురు ప్రేమ జంట వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ కావడంతో ఈ పెళ్లిళ్ల తంతుపై నరేష్ స్పందించారు. ఏ సినిమా వాళ్లే పెళ్లిళ్లు చేసుకుంటున్నారా? మిగతా వాళ్లు పెళ్లిళ్లు చేసుకోవడం లేదా? అంటూ తనదైన శైలిలో స్పందించారు.
సినిమా వాళ్లే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటున్నారని అంటుంటారు.. ఎందుకంటే వాళ్లు మాత్రమే కనిపిస్తారు. మిగిలిన వాళ్లు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా కనిపించరు. పెళ్లిళ్లు అనేది ఆట కాదు.. పెళ్లి అంటే లైఫ్. ఆ లైఫ్‌లో ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తే తప్ప వేరే పెళ్లి నిర్ణయానికి రారు. భార్యాభర్తల మధ్య సర్ధుకోవడం అనేది లేకపోతే పెళ్లి చేసుకోవడం వేస్ట్.
ఇంతకు ముందు ఫ్యామిలీ కోర్టు ఒకటే ఉండేది.. కానీ ఇప్పుడు ఎనిమిది ఫ్యామిలీ కోర్టులు వచ్చాయి. అంటే సినిమా వాళ్లే పెళ్లిళ్లు చేసుకుంటున్నారా? మిగతా వాళ్లు చేసుకోవడం లేదా? ఆర్టిస్ట్ అనేవాడికి స్థిరత్వం ఉండదు. సెక్యురిటీ లేదు.. టైమింగ్ లేదు.. నేను నెలలో 28 రోజులు పనిచేసేవాడిని. అలాంటి నాతో అడ్జెస్ట్ అయ్యి ఉన్న వాళ్లే నాతో ఉండగలరు.
- Advertisement -
నా పర్సనల్ లైఫ్ ఇంపాక్ట్.. సినిమా లైఫ్‌పై పడదు.. పడనీయను. సినిమానే నా పర్సనల్ లైఫ్.. మూవీ ఈజ్ మై వైఫ్. నా ఫస్ట్ వైఫ్ సినిమా. సినిమా కోసం నేను ఏదైనా వదులుకుంటా.. పిచ్చి అనుకోవచ్చు.. ఏమైనా అనుకోవచ్చు.. నా ఇష్టాలను తెలుసుకుని నాతో ఎవరైతే ట్రావెల్ అవుతారో వాళ్లే నాతో వస్తారు.. మిగిలిన వాళ్లు వెళ్లిపోతారు’ అని అన్నారు నరేష్.