Godfather Movie : ప్రేమని మాత్రమే నేనిస్తే, మైలు రాయిని ఇచ్చావ్ అన్నయ్యా.! చిరంజీవిపై సత్యదేవ్ ఎమోషనల్ పోస్ట్.!

NQ Staff - September 27, 2022 / 03:01 PM IST

Godfather Movie  : ప్రేమని మాత్రమే నేనిస్తే, మైలు రాయిని ఇచ్చావ్ అన్నయ్యా.! చిరంజీవిపై సత్యదేవ్ ఎమోషనల్ పోస్ట్.!

Godfather Movie : మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానులు చాలామందే వున్నారు. లక్షలాదిమంది, కోట్లాదిమంది అభిమానులు అలాంటోళ్ళున్నారు. అందులో చాలామంది సినీ ప్రముఖులూ వున్నారు. ఆ సినీ ప్రముఖుల లిస్టులో యంగ్ హీరో సత్యదేవ్ పేరు కూడా ఖచ్చితంగా వుంటుంది.

మలయాళ సినిమా ‘లూసిఫర్’ని తెలుగులోకి ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తుండగా, నెగెటివ్ రోల్‌లో సత్యదేవ్ నటించాడు. ఆ పాత్రలో సత్యదేవ్‌కి చిరంజీవే స్వయంగా అవకాశమివ్వడం గమనార్హం.

ప్రేమని మాత్రమే ఇవ్వగలిగాను..

అన్నయ్యా.. ఒక అభిమానిగా నేను మీకు ప్రేమని మాత్రమే ఇవ్వగలిగాను.. మీరు నాకు జీవితంలో గుర్తుండిపోయే ఒక మైలురాయిని ఇచ్చారు.. థాంక్యూ.. అంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు సత్యదేవ్.
‘ఆ పాత్రని చేస్తాడో లేదోనన్న సందేహం నాకు వుండేది. అడగ్గానే, చేస్తానన్నాడు.

చాలా బాగా వచ్చింది ఆ పాత్ర..’ అంటూ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో సత్యదేవ్ పాత్ర గురించి చెప్పడం పట్ల ఎమోషనల్ అవుతున్నాడు సత్య దేవ్. అంతే మరి, అభిమాన నటుడితో కలిసి పని చేసే అవకాశం రావడం, అందునా మెగాస్టార్ చిరంజీవికి పోటీగా తెరపై కనిపించడమంటే చిన్న విషయం కాదు కదా.!

 

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us