Saravanan : ‘లెజెండ్’ శరవణన్ కళా ఖండం.! ఓటీటీకి ఎందుకు ఇవ్వట్లేదో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
NQ Staff - October 26, 2022 / 11:16 AM IST

Saravanan : మెగాస్టారులు.. సూపర్ స్టారులు.. పాన్ ఇండియా స్టారులు కూడా ‘లెజెండ్’ శరవణన్ ముందర దిగదుడుపే.! నటన మీద ఆసక్తితో తన వ్యాపార ప్రకటనల్లోనూ తానే నటించేస్తుంటారు ప్రముఖ వ్యాపారవేత్త శరవణన్. తమిళనాడులో శరవణన్ గురించి తెలియనివారెవరూ వుండరు.
ఇప్పుడు ‘లెజెండ్’ శరవణన్ అంటే తెలియనివారు బహుశా దేశంలో ఎవరూ వుండరేమో. దానిక్కారణం, ‘ది లెజెండ్’ సినిమానే.! ఆ సినిమాలో ఆయన నటించేశాడు.. నిర్మాత కూడా ఆయనగారే. సినిమా విడుదలై చాన్నాళ్ళే అయ్యింది. కానీ, ఆ సినిమా ఇంకా ఓటీటీలోకి రాలేదు.
ఓటీటీకి ఇవ్వకూడదనుకున్నాడట..
‘నా సినిమా అంత తేలిగ్గా అందరికీ దక్కకూడదనుకున్నాను. అందుకే, సినిమా విడుదలకు ముందు బోల్డన్ని క్రేజీ ఆఫర్లు ఓటీటీ వేదికల నుంచి వచ్చినా ఇవ్వలేదు..’ అంటూ తాజాగా శరవణన్ వ్యాఖ్యానించాడు.
తీసింది గొప్ప కళా ఖండం మరి.. అంటూ శరవణన్ మీద మండిపడుతున్నారు. తానే సినిమా తీసుకున్నాడు.. తానే విడుదల చేసుకున్నాడు.. ఓటీటీలో అమ్మాలంటే, కొనేవాడుండాలి కదా.? అన్నది మెజార్టీ అభిప్రాయం. శరవణన్ మాత్రం, ‘ఐ యామ్ ది లెజెండ్’ అంటున్నాడు.
ఆ హైటు, ఆ పర్సనాలిటీ.. లిల్లీపుట్లా వున్న నువ్వు హీరో ఏంటి.? అంటూ ట్రోలింగ్ ఇప్పటికీ శరవణన్ మీద కొనసాగుతూనే వుంది. బాడీ షేమింగ్ మంచిది కాదుగా.ీ. ‘ది లెజెండ్’ సినిమా తీసి, నటన మీద తనకున్న కోరికను ఆయన తీర్చేసుకున్నాడన్నది నిర్వివాదాంశం.