Samantha : మ‌రో వ‌ర్కవుట్ వీడియో షేర్ చేసిన సమంత‌.. క‌ష్టం మాములుగా లేదుగా..!

Samantha : అందాల ముద్దుగుమ్మ స‌మంత ఫిట్‌నెస్‌పై ఎంత ప్ర‌త్యేక దృష్టి పెడుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సినిమా షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ అమ్మడు జిమ్‌లో వ‌ర్క‌వుట్స్ చేస్తూనే ఉంటుంది. తన ఆరోగ్యాన్ని ఫిట్‌గా ఉంచుకోవడంలో ఎప్పుడూ తడబడలేదు. సామ్ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలే అందుకు నిదర్శనం.

Samantha work out new video
Samantha work out new video

వెయిట్ ట్రైనింగ్, పుల్ అప్ ఎక్సర్ సైజ్ లు, యోగా, సైక్లింగ్ , కార్డియో వంటివి సమంత చేసే వ్యాయామాలు. ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, సమంతా తన ఫిట్‌నెస్ ట్రైనర్ జునైద్ షేక్‌తో కలిసి జిమ్‌లో వ్యాయామం చేస్తున్న వీడియోను పంచుకుంది. అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఇది ఒక మార్గం.

2022ని పాజిటివ్‌గా మార్చాలని సవాల్ విసిరారు. అంటే జంపింగ్ స్క్వాట్ చేయడానికి మోకాలిని ఉపయోగించడం. ఈ ఉపకరణాలు ఏవీ ఉపయోగించకూడదు. అందులో టూల్స్ 2022 లేకుండా బాడీని లెవెల్ చేయమని సమంత ఛాలెంజ్ చేశారు. అంతేకాదు మీ కేలరీలను బర్న్ చేయడానికి ఇది మంచి ప్రారంభం అని ఆమె అన్నారు.

ఇక తాజాగా స‌మంత మ‌రో వెరైటీ వర్క‌వుట్ వీడియో షేర్ చేసింది. స్లో మూమెంట్ వ‌ర్క‌వుట్ వీడియో చూసి ప్ర‌తి ఒక్క‌రు స్ట‌న్ అవుతున్నారు. సమంత ఇంత ఫిట్‌గా ఉండ‌డానికి కార‌ణం ఇవేనా అంటూ ప‌లువురు నెటిజ‌న్స్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

టాలీవుడ్ లో క్రేజీ కపుల్స్ గా ఉన్న నాగ చైతన్య, సమంత విడిపోతారని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. గత ఏడాది వీరిద్దరి బ్రేకప్ టాలీవుడ్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ గా మిగిలిపోయింది. వీరిద్దరూ విడిపోయి నెలలు గడచిపోతున్నాయి. ఎవరి సినిమాలతో వారు బిజీ అయిపోయారు. సమంత పాన్ ఇండియా చిత్రాలతో రెడీ అవుతోంది. ఇక నాగ చైతన్య ఈ సంక్రాంతికి బంగార్రాజు చిత్రంతో చిన బంగార్రాజుగా వచ్చేస్తున్నాడు.