Samantha : చైతూకు షాక్ ఇచ్చిన సమంత.. ఆ హీరోతో కమిట్ అయిపోయిందిగా..!
NQ Staff - January 28, 2023 / 11:38 AM IST

Samantha : సమంత, చైతూలకు సంబంధించిన ఏ మ్యాటర్ అయినా సరే ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ జంటకు ఉన్న క్రేజ్ అలాంటిది. ప్రేమించి పెండ్లి చేసుకున్న ఈ ఇద్దరూ మొదట్లో ఎంతో అన్యోన్యంగా జీవించారు. కానీ నాలుగేండ్లకే విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చింది ఈ జంట. అప్పటినుంచి ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉంటున్నారు.
ఇప్పుడు సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడి బాధ పడుతోంది. ఆ వ్యాధి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోక ముందే మళ్లీ సినిమాల షూటింగుల్లో పాల్గొంటుంది. ఇక నాగచైతన్య కూడా తన సినిమాల్లో బిజీగా ఉంటున్నాడు. కానీ చైతూ కంటే సమంతనే తన సినిమాలతో హిట్లు కొడుతోంది. అయితే వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఓ సినిమా చేయాలని అనుకున్నారు.
అగ్రిమెంట్ క్యాన్సిల్..
చైతూ, సమంత హీరో, హీరోయిన్లుగా నందనిరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేద్దామని అప్పట్లోనే అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. కానీ వీరిద్దరూ విడిపోవడంతో ఆ మూవీ అటకెక్కింది. అయితే వీరిద్దరి కాంబోలో రావాల్సిన సినిమా అగ్రిమెంట్ ను చైతూ క్యాన్సిల్ చేసుకున్నాడు. దాంతో ఈ ప్రాజెక్టులోకి మరో హీరోను తీసుకోవాలని భావిస్తున్నారు నందినిరెడ్డి.

Samantha Teaming Nani In The Film Directed By Nandini Reddy
అయితే తాజాగా ఈ మూవీలోకి నానిని తీసుకుంటున్నారంట. ఇప్పటికే నందినిరెడ్డి కథను కూడా నానికి వినిపించిందంట. ఆయన కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో సమంత కూడా హ్యాపీగానే ఉందని తెలుస్తోంది. అంటే చైతూ చేయక పోయినా తాను వేరే హీరోతో చేయడానికి సమంత రెడీగా ఉందన్నమాట.