Samantha : ఆసుపత్రిలో కాదు, సమంత ఇంట్లోనే వుంది.! ఇదీ క్లారిటీ.!
NQ Staff - November 24, 2022 / 03:25 PM IST

Samantha : మయోసైటిస్ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సమంత, ఆ అనారోగ్య సమస్యకు సంబంధించి వైద్య చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది నెలలుగా సమంత ఈ రుగ్మతకు సంబంధించిన ‘కఠినతరమైన’ వైద్య చికిత్స పొందుతోంది.
బరువు తగ్గించుకోవడం, స్టెరాయిడ్స్ సాయం తీసుకోవడం.. ఇలా సమంత చాలా చాలా కష్టపడుతోంది ‘మయోసైటిస్’ నుంచి బయటపడేందుకు. ‘యశోద’ సినిమా ప్రమోషన్ల కోసం సమంత ప్రత్యక్షంగా పనిచేయలేకపోయింది. సినిమాకి డబ్బింగ్ కూడా, చేతికి సెలైన్ వుండగానే చెప్పింది సమంత.
ఆసుపత్రిలో లేదట.. అవన్నీ పుకార్లేనట..
సమంత ప్రస్తుతం తన ఇంట్లోనే వుందంటూ ఆమె మేనేజర్ ఓ ప్రకటన విడుదల చేశారు. మయోసైటిస్ ముదరడంతో సమంత ఆరోగ్య పరిస్థితి విషమించిందనీ, ఓ ఆసుపత్రిలో ఆమెకు వైద్య చికిత్స అందుతోందనీ ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారాన్ని సమంత మేనేజర్ ఖండించారు.
ప్రస్తుతం సమంత కోలుకుంటున్నారనీ, ఇంటి వద్దనే వుండి రెస్ట్ తీసుకుంటున్నారనీ ఆమె మేనేజర్ పేర్కొన్నారు. దాంతో, సమంత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంకోపక్క, ‘యశోద’ సినిమాపై వివాదం నడుస్తోంది. ‘ఇవా’ అనే ఆసుపత్రి యాజమాన్యం, తమను సినిమాలో కించపర్చేలా చూపించారని ఆరోపిస్తోంది.