Shakuntalam : ఊపిరి పీల్చుకున్న సమంత అభిమానులు.! ‘శాకుంతలం’ ఆ కష్టం గట్టెక్కినట్లే.!
NQ Staff - September 23, 2022 / 06:22 PM IST

Shakuntalam : సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘శాకుంతలం’ సినిమా విడుదల కాకపోవచ్చనే ప్రచారం నిన్న మొన్నటిదాకా జరిగింది. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాని నిర్మించిన విషయం విదితమే. భారీ బడ్జెట్‌తో శాకుంతలం సినిమాని రూపిందించారు.

Samantha Shakuntalam movie release date
అయితే, సమంత వైవాహిక జీవితంలో వచ్చిన కుదుపు, తదనంతర పరిణామాల నేపథ్యంలో ‘శాకుంతలం’ సినిమాని పక్కన పెట్టేశారన్న ప్రచారం జరిగింది. అంతేనా, సినిమా అసలు విడుదలయ్యే అవకాశమే లేదంటూ ఊహాగానాలు వినిపించాయి. ఓటీటీకి ఇవ్వడం మినహా మరో దారి కూడా లేదంటూ సినీ వర్గాల్లో గుసగుసలు షురూ అయ్యాయి.
శాకుంతలం రిలీజ్ డేట్ వచ్చేసింది..
నవంబర్ 4న ‘శాకుంతలం’ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సో, ఇది సమంత అభిమానులకి పెద్ద ఊరటగానే చెప్పుకోవాలి. నాగచైతన్యతో విడాకుల తర్వాత తెలుగులో సమంత నుంచి రానున్న స్ట్రెయిట్ మూవీ ఇదే. ‘పుష్ప’లో సమంత స్పెషల్ సాంగ్‌కే పరిమితమైన సంగతి తెలిసిందే.
ఇదిలా వుంటే, ‘శాకుంతలం’ సినిమాకి పెట్టిన బడ్జెట్ నేపథ్యంలో, ఆ స్థాయి బజ్ రాకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇలాగైతే ఎలా.? అన్న చర్చ గుణ శేఖర్ అండ్ టీమ్‌లో కనిపిస్తోంది. గుణశేఖర్ సినిమాల్లో చాలావరకు కాస్ట్ ఫెయిల్యూర్స్ వుంటాయ్. మరి, ‘శాకుంతలం’ విషయంలో ఏం జరుగుతుందో.!