Samantha : సమంతకి తీవ్ర అనారోగ్యం.! ఆ బరువులెలా మోసిందబ్బా.?

NQ Staff - October 31, 2022 / 02:36 PM IST

Samantha  : సమంతకి తీవ్ర అనారోగ్యం.! ఆ బరువులెలా మోసిందబ్బా.?

Samantha  : సినీ నటి సమంత తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. తాను మయోసైటిస్‌తో బాధపడుతున్నట్లు సమంత సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో, ‘గెట్ వెల్ సూన్ సామ్’ అంటూ మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీయార్ సహా పలువురు సినీ ప్రముఖులు స్పందించారు.

మయోసైటిస్ లక్షణాలేంటి.? చికిత్స విధానం ఎలా వుంటుంది.? అంటూ నెటిజన్లు తెగ వెతికేశారు. కొంత ప్రమాదకరమైన వ్యాధి అది అని కొందరు వైద్య నిపుణులు చెబుతోంటే, అదేమంత ప్రమాదకరం కాదని కొందరు అంటున్నారు.

అసలు సమంతకి ఎలా.?

సమంత గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఫిట్నెస్ విషయంలో అస్సలేమాత్రం రాజీ పడదు. పైగా బరువులు ఎత్తే విషయంలో సమంత ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తుంటుంది.

మయోసైటిస్ ప్రధాన లక్షణాల్లో కండరాల వాసు, నొప్పి.! అలాంటి సమస్య వున్నవారు.. ఎలా బరువులు ఎత్తగలు.? సమంత దాదాపు 100 కిలోల బరువుని ఎత్తి, సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వీడియోల్ని పోస్ట్ చేసేది.

అంతే కాదు, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ కోసం వీరోచితమైన రీతిలో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చేసేసింది. అతిగా వర్కవుట్లు చేసి, జీరో సైజ్ ఫిజిక్ కోసం కష్టపడి ఇంతటి తీవ్రమైన అనారోగ్య సమస్యను సామ్ కొనితెచ్చుకుందా.? అనే విమర్శలూ వస్తున్నాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us