Samantha : ఆ విషయంలో నయనతారకు కాస్త దూరంలో ఉన్న సమంత

NQ Staff - June 5, 2023 / 10:01 PM IST

Samantha : ఆ విషయంలో నయనతారకు కాస్త దూరంలో ఉన్న సమంత

Samantha : సౌత్ స్టార్ హీరోయిన్స్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ ఎవరు అంటే వెంటనే వినిపించే పేరు నయనతార. బాలీవుడ్ ముద్దుగుమ్మలు సౌత్ లో నటిస్తే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటారేమో కానీ.. వారి రెమ్యూనరేషన్‌ నయనతార తర్వాతే అంటూ పలు సందర్భాల్లో వెల్లడయింది.

నయనతార ఒక్కొక్క సినిమాకు నాలుగు నుండి ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకు ఉంటుందని ఆ మధ్య పలు తమిళ మీడియా సంస్థలు వెల్లడించాయి. తాజాగా నయనతారకు కాస్త అటు ఇటుగా స్టార్ హీరోయిన్ సమంత కూడా భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటుందని వార్తలు వస్తున్నాయి.

సమంత రెమ్యూనరేషన్ సినిమా కథ అనుసారంగా మూడు నుండి నాలుగు కోట్ల రూపాయలు ఉంటుందట. దాంతో సమంత సౌత్ లో భారీ పారితోషికం తీసుకుంటున్న రెండవ హీరోయిన్ గా నిలిచింది అంటూ తమిళ మీడియా సంస్థలు కథనాలను వెల్లడిస్తున్నాయి.

మొత్తానికి నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత సమంత హీరోయిన్ గా మరింత బిజీ అవ్వడం మాత్రమే కాకుండా పారితోషికం విషయంలో కూడా రెట్టింపు అన్నట్లుగా దూసుకుపోతుంది, ముందు ముందు బాలీవుడ్‌ మరియు హాలీవుడ్‌ సినిమాలతో కూడా సమంత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us