Samantha : కమిట్ మెంట్ అడిగేవాళ్లు నీచులు.. సమంత సీరియస్ వ్యాఖ్యలు..!
NQ Staff - January 26, 2023 / 12:58 PM IST

Samantha : సినీ ఇండస్ట్రీని ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న దాంట్లో కాస్టింగ్ కౌచ్ కూడా ఒక్కటి. ఈ కాస్టింగ్ కౌచ్‌కు చాలామంది బలైపోతున్నారు. ఒకప్పటి కంటే ఇప్పుడే ఇలాంటివి బాగా పెరిగిపోతున్నాయి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వస్తున్న వారికే ఇలాంటివి బాగా ఎదురవుతున్నాయి. చాలామంది ఇలాంటి వాటి బారిన పడి మోసపోతున్నారు.
ఇంకొందరు మాత్రం వీటిని చాకచక్యంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్లిపోతున్నారు. ఇంకొందరు అయితే ఎంచక్కా కమిట్ మెంట్లు ఇచ్చేసి ఛాన్సులు పడుతున్నారు. అయితే శ్రీరెడ్డి నిరసన తర్వాత చాలామంది దీనిపై ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. తమ లైఫ్ లో తమకు జరిగిన అనుభవాలను పంచుకుంటున్నారు.
అన్ని రంగాల్లో ఉంది..
అయితే గతంలో సమంత కూడా ఈ ఇష్యూ మీద స్పందించింది. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కమిట్ మెంట్ అడిగే నీచులు అన్ని రంగాల్లో కూడా ఉన్నారు. కేవలం సినీ ఇండస్ట్రీకే దీన్ని పరిమితం చేయడం కరెక్టు కాదు. కాకపోతే అది మనం ప్రవర్తించే తీరును బట్టి ఉంటుంది.
సినిమా రంగంలో రాణించాలంటే హిట్టు, ప్లాపు అనేవి కామన్. నా కెరీర్ లో కూడా నేను చాలా ఇబ్బందులు పడ్డాను. కానీ నాకు కాస్టింగ్ కౌచ్ అనేది ఎదురు కాలేదు అంటూ తెలిపింది సమంత. ఆమె చేసిన కామెంట్లు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. మరి కాస్టింగ్ కౌచ్ మీద మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.