Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సెన్సేషన్‌గా మారింది. ఏ రోజు చూసిన ఈ అమ్మడి గురించి ఏదో ఒక వార్త హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. చైతూ నుండి విడిపోయాక జోరు పెంచిన ఈ ముద్దుగుమ్మ పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసి అందరని అబ్బురపరచింది. రీసెంట్‌గా ఫుల్ సాంగ్ విడుదల కాగా, ఇది చూసి అందరు షాకవుతున్నారు. సమంత ఇలా చేయడమేంటని కొందరు నోరెళ్లపెడుతున్నారు.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే ప్యాన్ ఇండియా సినిమా డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమాలో సమంత డాన్స్ చేసిన పాపులర్ సాంగ్ ఊ..అంటావా మావ.. ఊహూ అంటావా మావా.. అనే సాంగ్‌ను యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఉ అంటావా..ఊ ఊ అంటావా ను చంద్రబోస్ రాయగా.. ఇంద్రవతి చౌహాన్ పాడారు. ఈ పాటలో సమంత అందాల ఆరబోసి చేసి ఔరా అనిపించింది.
ఈ పాట కోసం ఏకంగా రూ. 50 లక్షల వరకు పారితోషకం అందుకున్నట్టు సమాచారం. తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో 120 మిలియన్ వ్యూస్ రాబట్టింది. రీసెంట్‌గా ఈ పాట కోసం సమంత ఏ రేంజ్‌లో కష్టపడిందో తెలిపే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పాట కోసం కొరియోగ్రాఫర్‌తో కలిసి చేసిన డాన్స్ మూమెంట్స్‌ను చూసి అభిమానులు ఔరా.. ఓ పాట కోసం హీరోలు, హీరోయిన్లు ఏ రేంజ్‌లో కష్టపడతారన్నది మరోసారి తెలియవచ్చింది.
ఇక తన ఫిజిక్ కోసం సమంత ఎప్పుడు కష్టపడుతూనే ఉంటుంది. ఇప్పుడు బాలీవుడ్ తో పాటు రెండు పాన్ ఇండియా సినిమాలు, రెండు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ చేతిలో ఉండడంతో వాటిపై పూర్తిగా దృష్టి సారించింది. ఈ మేరకు మెరుపు తీగలా మారి, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడానికి జిమ్ లో తీవ్రంగా కష్టపడుతోంది ఈ అమ్మడు.
తాజాగా ఆమె జిమ్ లో చేసిన హెవీ ఇంటెన్స్ వర్కౌట్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. “గో లో గో హోమ్… బ్యాక్ టు బేసిక్స్ @ జునైద్ షేక్ కరెక్టింగ్ మై ఫార్మ్” అంటూ ఈ వీడియోను షేర్ చేయగా, ఇప్పుడది వైరల్ అవుతోంది. సమంత పడుతున్న కష్టాన్ని చూసి అందరు షాక్ అవుతున్నారు.