Samantha : మయోసైటిస్ : సమంత తప్పు చేసిందా.? ఒప్పు చేసిందా.?

NQ Staff - October 29, 2022 / 10:33 PM IST

Samantha : మయోసైటిస్ : సమంత తప్పు చేసిందా.? ఒప్పు చేసిందా.?

Samantha : సినీ నటి సమంత సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్.. చాలామందికి ఆందోళన కలిగించింది.. చాలామందిని ఆలోచనలో పడేసింది.! తాను మయోసైటిస్ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు సమంత పేర్కొనడమే అందుకు కారణం.

సహజంగానే సమంతని ‘అటెన్షన్ సీకర్’ అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. సమంత పబ్లిసిటీ స్టంట్ చేసిందన్నది వాళ్ళ ఆరోపణ. అయినా, సమంతకి పబ్లిసిటీ స్టంట్లు చేయాల్సిన అవసరమేంటి.? తన తాజా చిత్రం ‘యశోద’ విడుదలవుతున్న నేపథ్యంలో, సమంత ఇప్పుడీ ‘సెంటిమెంటు’ కార్డుని తెరపైకి తెచ్చిందనే ఆరోపణల్లో నిజమెంత.?

ఆలోచింపజేసేలా.. జాగ్రత్తపడేలా..

నిజానికి, స్టార్ హీరోయిన్లు తమకున్న అనారోగ్య సమస్యల గురించి చెప్పుకోవడానికి ఇష్టపడరు. పైగా, తీవ్రమైన అనారోగ్య సమస్యల విషయంలో బయటకు చెబితే, వాళ్ళకి అవకాశాలు అక్కడితో ఆగిపోతాయి. సో, సమంత చాలా డేరింగ్ స్టెప్ తీసుకుందన్నమాట.

ఇక, ‘మయోసైటిస్’ అంటే ఏంటి.? అని చాలామంది ఇప్పుడు వెతుకులాట మొదలు పెట్టారు. ఈ వ్యాధి పట్ల ఇప్పుడు చాలామందిలో అవగాహన కలుగుతోందంటే, దానికి సమంత కారణమని నిస్సందేహంగా చెప్పొచ్చు. కొంతమందికి తమకు తెలియకుండానే ఈ వ్యాధి వుండి వుండొచ్చు. అలాంటివాళ్ళు వైద్యుల్ని సంప్రదిస్తే, సాధారణ వైద్య చికిత్సతోనే వాళ్ళకి ఆ సమస్య నుంచి పూర్తిస్థాయి ఉపశమనం లభించే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us