Naga Chaitanya And Samantha : దటీజ్ నాగచైతన్య.! చెప్పేశాను కదా, చెప్పడానికేమీ లేదింక.!
NQ Staff - August 1, 2022 / 07:11 AM IST

Naga Chaitanya And Samantha : అక్కినేని నాగచైతన్య, సమంత.. ప్రేమించుకుని.. పెద్దల్ని ఒప్పించి పెళ్ళి చేసుకుని.. తమ మధ్య మనస్పర్ధలు రావడంతో.. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.
వైవాహిక జీవితం అనేది ఈ ఇద్దరికీ ముగిసిన కథ. విడాకులు తీసుకున్నాక ఎవరి పనుల్లో వారు బిజీగా వున్నారు. కానీ, సమంత మాత్రం తరచూ సెటైరికల్‌గా ఏదో ఒక కామెంట్ వేస్తూనే వస్తోంది. సోషల్ మీడియా ద్వారా కావొచ్చు, ఇంటర్వ్యూలలో కావొచ్చు.. సమంత చేస్తున్న ‘సర్కాస్టిక్’ వ్యాఖ్యలు అక్కినేని అభిమానుల్ని అసహనానికి గురిచేస్తున్నాయి.

Samantha Fans Questioned Naga Chaitanya Divorce
కెలుకుతున్నదెవరు.?
అక్కినేని అభిమానులు సమంతని కెలుకుతున్నారు. ఇది నిజం. అదే సమయంలో సమంత అభిమానులు కూడా అక్కినేని నాగచైతన్యను కెలుకుతున్నారు. నాగచైతన్య మాత్రం అస్సలు ఈ వ్యవహారాలపై స్పందించడంలేదు. ‘చెప్పాల్సింది కలిసే చెప్పేశాం కదా.. ఇక చెప్పడానికేమీ లేదు.. ఆ విడాకుల వ్యవహారానికి సంబంధించి..’ అంటూ తాజాగా అక్కినేని నాగచైతన్య వ్యాఖ్యానించాడు. దటీజ్ అక్కినేని నాగచైతన్య.