Samantha Anger On Naga Chaitanya : చైతన్యపై పీకల్లోతు కోపాన్ని బయట పెట్టిన సమంత..!

NQ Staff - August 18, 2023 / 12:33 PM IST

Samantha Anger On Naga Chaitanya : చైతన్యపై పీకల్లోతు కోపాన్ని బయట పెట్టిన సమంత..!

Samantha Anger On Naga Chaitanya :

సమంత, నాగచైతన్య.. ఇద్దరూ విడాకులు తీసుకునిరెండేళ్లు దగ్గరకు వస్తోంది. కానీ ఇంకా ఇద్దరి విషయాలు ఎప్పుడూ హాట్ టాపికే అవుతుంటాయి. ఎవరు ఎక్కడ ఏం మాట్లాడినా సరే దాన్ని అవతలి వ్యక్తిని ఉద్దేశించే చేశారనే వార్తలు అప్పటికప్పుడే దర్శనమిస్తుంటాయి. ఇద్దరిలోనూ ఎక్కువగా సమంత మీదనే ట్రోల్స్ అధికంగా వస్తుంటాయి. ఎందుకంటే ఆమె చైతూ మీద కోపాన్ని అందరి ముందే బయట పెట్టేస్తూ ఉంటుంది. కానీ నాగచైతన్య మాత్రం అలా కాదు. సమంత గురించి ఎప్పుడూ పాజిటివ్ గానే స్పందిస్తూ ఉంటాడు. ఇప్పుడు సమంత మరోసారి ఇలాంటి పనే చేసింది.

ఇప్పుడు తాజాగా ఆమె నటిస్తున్న మూవీ ఖుషీ. విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 1న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మొన్న నిర్వహించారు. ఇందులో సమంత, విజయ్ కాస్త ఓవర్ గా రెచ్చిపోయారు. సమంతను విజయ్ ఎక్కడ పడితే అక్కడ పట్టుకుని ఎత్తుకుని తిప్పేయడం తీవ్రమైన ట్రోల్స్ కు దారి తీసింది. ఇది కాసేపు పక్కన పెడితే ఇదే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓ లేడీ సింగర్ ఓ పాట పాడింది. అది అనుకోకుండా సమంతను ఇబ్బంది పెట్టేసింది. సడెన్ గా ఇలా జరుగుతుందని బహుషా సమంతకు కూడా తెలియదేమో.

ఇంతకీ ఆ లేడీ సింగర్ పాడిన పాట ఏదో కాదండోయ్.. మజిలీ సినిమాలో సమంత, నాగచైతన్య మధ్య వచ్చే పాట. ఇష్టమైన సఖుడా అనే పాట చాలా ఫేమస్ అయింది. ఇందులో తన భర్త కోసం ఆరాట పడే, అమితంగా ప్రేమించే అమ్మాయిగా సమంత నటించింది. అందులో నాగచైతన్య, సమంత కెమిస్ట్రీ ఓ రేంజ్ లో హిట్ అయింది. అయితే నిజ జీవితంలో కూడా సమంతకు చైతన్యకు మధ్య వివాహ బంధం ఉంది. కానీ ఇద్దరూ విడిపోవడంతో.. ఇప్పుడు ఆ పాట తన భర్తను గుర్తు చేసినట్టుంది. అందుకే ఆ పాట పాడుతున్నంత సేపు సమంత ముఖంలో అసహనం స్పష్టంగా కనిపించింది.

కావాలనే ముఖాన్ని అటు ఇటు తిప్పుకోవడం, ఈ పాట ఎప్పుడు అయిపోతుందిరా బాబు అన్నట్టు ఆమె ముఖంలో కోపం కూడా కనిపించింది. అంటే కనీసం తన భర్త నటించిన పాట కూడా తనకు ఇష్టం లేదని సమంత కదలికలను బట్టి అర్థం అవుతోంది. సమంత కనిపిస్తే ప్రేమగా ఒక హగ్ ఇస్తాను అని చైతన్య చెబుతున్నారు. కానీ చైతన్య పేరు కూడా నా ముందు వద్దు అన్నట్టు సమంత కోపాన్ని చూపిస్తోంది.

ఏదేమైనా సమంత చేస్తున్న పనులు కాస్త విమర్శలకు తావిస్తున్నాయి. మరీ అంత కోపం ఎందుకు అని అంటున్నారు అక్కినేని అభిమానులు. ఈ వీడియోను చూసిన మరికొందరు మాత్రం సమంతకు కావాలనే ఆ పాట పాడి కోపం తెప్పించారని అంటున్నారు. ఏదేమైనా సమంత తన స్థాయికి తగ్గట్టు ప్రవర్తిస్తేనే ఆమెకు గౌరవం దక్కుతుందని గ్రహించాలి. ఇక ఖుషీ సినిమాకు మంచి రెస్పాన్స్ ఉంది. కాబట్టి ఈ మూవీ హిట్ అయితే అటు విజయ్ కు ఇటు సమంతకు బాగా కలిసి వస్తుంది.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us