Samantha : స‌మంతతో మ‌ళ్లీ అఆ అన‌బోతున్నార‌ట‌.. మ‌రో బ్లాక్ బ‌స్ట్ బ‌స్ట‌ర్ ఫిక్స్ అనుకోవాలా..!

Samantha : టాలీవుడ్‌లో కొన్ని క్రేజీ కాంబినేష‌న్స్ సెట్ అవుతున్నాయి అంటే అభిమానుల‌లో ఎంత ఆస‌క్తి ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అందుకు కార‌ణం గ‌తంలో వారి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమాలు మంచి విజ‌యాలు సాధించ‌డమే. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ఇటీవ‌ల ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. 2020 ప్రారంభంలో `అల వైకుంఠపురములో` చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ని సొంతం చేసుకున్నారు.

Samantha again in trivikram movie
Samantha again in trivikram movie

త్రివిక్ర‌మ్ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఈ సమయంలో ఎన్టీఆర్ సినిమా ప్రకటించినా అది ముందుకు వెళ్లలేదు. దీంతో ఆయన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `భీమ్లా నాయక్` చిత్రానికి స్క్రీన్ ప్లే డైటాగ్స్ అందించాల్సి వచ్చింది. ఈ మూవీ పనుల్లో ఆయన బిజీ అయిపోయారు. ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహించారు.త్వరలో త్రివిక్రమ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ తో ఓ భారీ మూవీని చేయబోతున్న విషయం తెలిసిందే.

మ‌హేష్ -త్రివిక్ర‌మ్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రూపొందబోతోంది. అయితే మహేష్ ప్రస్తుతం `సర్కారు వారి పాట` చేస్తుండటం ఆ తరువాత రాజమౌళి తో భారీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి రావడానికి మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. అంతే కాకుండా ఎన్టీఆర్ తో మూవీ అనుకుంటే తను కొరటాల శివ సినమాకి వెళ్లిపోయాడు.

ఈ పరిస్థితిలో త్రివిక్రమ్ ఓ చిన్న సినిమాని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో `సన్నాఫ్ సత్యమూర్తి` ..అజ్ఞాతవాసి కి మధ్యలో సమంత నితిన్ తో ఫిమేల్ సెంట్రిక్ మూవీగా `అఆ`ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అదే తరహాలో సమంత తో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీని చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ఇప్పటికే ఓ నవల హక్కుల్ని సొంతం చేసుకున్నారని ఇందుకు సంబంధించిన వర్క్ ని స్టార్ట్ చేశారని తెలుస్తోంది. `అఆ` తరహాలోనే రాకెట్ స్పీడుతో ఈ మూవీని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందులో నటించే హీరో ఎవరన్నది మాత్రం ఇంకా బయటికి రాలేదు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటికి రానున్నట్టు చెబుతున్నారు.