Samantha : మ‌రోసారి నెగెటివ్ పాత్ర చేసేందుకు సిద్ధ‌మైన స‌మంత‌.. ఆశ్చ‌ర్య‌పోతున్న అభిమానులు

Samantha : స‌మంత ఇటీవ‌లి కాలంలో త‌న‌లోని కొత్త టాలెంట్‌ని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తుంది. ఈ క్ర‌మంలో విభిన్న‌మైన పాత్ర‌లు పోషిస్తూ ఐటెం సాంగ్స్‌కి సై అంటుంది. పుష్ప సినిమా కోసం ఐటెం భామగా మారిన ఈ ముద్దుగుమ్మ త‌న డ్యాన్స్ తో పాటు అంద‌చందాల‌తో అద‌ర‌గొట్టింది. కొత్తగా అనిపించిన పాత్ర ఏదైనా చేయడానికిసై అంటుంది సామ్. అది హీరోయిన్ గా అయినా.. విలన్ క్యారెక్టర్ అయినా సరే వెనకడుగు వేసే ప్రస్తక్తే లేదంటుంది.

Samantha again doing negative role
Samantha again doing negative role

ఇప్ప‌టికే స‌మంత ఫ్యామిలీ మ్యాన్ 2లో నెగెటీవ్ క్యారెక్టర్ తో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.. ఆ సిరిస్ కు అంత ఆధరణ రావడంతో అప్పటి నుంచి తాను నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తానంటూ చెప్పేసింద కూడా. అనుకున్నట్టుగానే డిఫరెంట్ క్యారెక్టర్స్ సెలక్ట్ చేసుకుని మరీ సినిమాలు చేస్తుంద సమంత. రీసెంట్ గా హాలీవుడ్ మూవీ అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ సినిమాలో బైసెక్సువల్ క్యారెర్టర్ చేయబోతోంది.

టాలీవుడ్ లో శాకుంతలం,యశోద మూవీలను చేస్తుంది సామ్. వాటితో పాటు తమిళంలో విజయ్ సేతుపతి , నయనతార కాంబినేషన్ లో సమంత ఓ మూవీ చేస్తుంది. కాత్తువాక్కుల రెండు కాదల్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో ఖతిజా పాత్రలో నటిస్తున్నట్టు గతంలోనే పోస్టర్ ద్వారా ప్రకటించారు టీమ్.

అయితే తాజా సమాచారం ప్రకారం ఇది నెగెటీవ్ క్యారెక్టర్ అని తెలుస్తుంది. ఈ మూవీలో విలన్ గా సమంత అలరించబోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా విజయ్ సేతుపతి-నయనతార ప్రేమికుల పాత్రల మధ్య సమంత చిచ్చుపెట్టే నెగెటీవ్ రోల్ ఖతిజా అంటూ కోలీవడ్ లో చర్చ నడుస్తుంది. ఫ్యామిలీ మెన్2 లో రాజీగా నెటెగీటీవ్ పాత్రలో అలరించిన సమంత.. ఖతిజాగా ఎంత విలనిజం చూపిస్తుందో చూడాలని ఆడియన్స్ తహతహలాడుతున్నారు.

ప్రస్తుతం యశోద మూవీ షూటింగ్ లో ఉన్నారు సమంత. గుణశేఖర్ డైరెక్షన్ లో శాంకుంతలం మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసేసింద. ఇక బాలీవుడ్ ఆఫర్స్ కూడా కొట్టేస్తుంది బ్యూటీ. త్వరలో బాలీవుడ్ సినిమాలపై క్లారిటీ ఇవ్వబోతోంది. ఇటు టాలీవుడ్ లో కూడా మరికొన్ని ఆఫర్స్ చేతిలో పెట్టుకుంది. వరుసగా వాటిని కంప్లీట్ చేయబోతుంది.