Samantha : బాలీవుడ్ యంగ్ హీరోతో క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌బోతున్న స‌మంత‌

 

Samantha :  అందాల ముద్దుగుమ్మ స‌మంత.. చైతూ నుండి విడిపోయిన‌ప్పటి నుండి వ‌రుస సినిమాలు చేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఒక‌వైపు పాన్ ఇండియా సినిమాలో మ‌రోవైపు ఐటెం సాంగ్స్ చేస్తూ రచ్చ చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌తో కూడా అద‌ర‌గొట్టిన విష‌యం తెలిసిందే.

విడాకుల ప్రకటన తర్వాత దక్షిణాది అగ్రకథానాయిక సమంత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే రెండు బైలింగ్విల్ మూవీస్ – ఒక పాన్ ఇండియా సినిమాతో పాటుగా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ హీరోతో క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నుంద‌ని స‌మాచారం.

samantha
samantha

బాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్ ఈ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. ఫీమేల్ లీడ్ కోసం సమంత ను ఎంపిక చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వరుణ్ ధావన్ – సమంత తొలిసారి కలిసి నటించనున్న ఈ వెబ్ సిరీస్ ద్వారా వరుణ్ ధావన్ ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నారని బాలీవుడ్ మీడియా వర్గాలు వెల్లడించాయి.

గూఢచర్యం నేపథ్యంలో సాగే కథతో రూపొందుతున్న ఈ సిరీస్ లో.. వరుణ్ ధావన్ – సామ్ ఇద్దరూ గూఢచారులుగా చాలా స్టైలిష్ గా కనిపించనున్నారట. ఇందులో యాక్షన్ సీన్స్ కోసం ఇద్దరూ ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకోబోతున్నారట. సమంత – వరుణ్ కలిసి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ మరింత ఆసక్తికరంగా మారింది.

samantha
samantha

‘అవెంజర్స్’ వంటి పాపులర్ సూపర్ హీరో చిత్రాలకు దర్శకత్వం వహించిన రూస్సో బ్రదర్స్ ఈ స్పై సిరీస్ ను నిర్మిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే రుస్సో బ్రదర్స్ ఆధ్వర్యంలో ”సిటాడెల్” అనే ఓ ఇంటర్నేషనల్ యాక్షన్ స్పై థ్రిల్లర్ సిరీస్ తెరకెక్కుతోంది. ఇందులో ప్రియాంక చోప్రా – రిచర్డ్ మ్యాడెన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 2022 ఏప్రిల్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

varun dhawan samantha
varun dhawan samantha

ఇప్పుడు ”సిటాడెల్” సిరీస్ ఇండియన్ వెర్షన్ నే రాజ్ & డీకే దర్శకత్వంలో వరుణ్ ధావన్ – సమంత లతో ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. భారతీయ ప్రేక్షకుల కోసం కొన్ని మార్పులతో ఈ స్పై థ్రిల్లర్ సిరీస్ ను తెరకెక్కించనున్నారట.