Salman Khan : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఇందులో సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఊ అంటావా మావ పాట సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. భాషాభేదాలతో సంబంధం లేకుండా మ్యూజిక్ లవర్స్ అందరిని ఈ స్పెషల్ సాంగ్ అలరించింది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన చార్ట్ బస్టర్ కు సౌండ్ బాక్సులు పగిలిపోయాయి. ఈ చిత్రంలో ‘శ్రీవల్లి’, ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా’ సాంగ్స్ ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉన్నాయి.
సల్మాన్ మెచ్చాడు..
ఈ సినిమాలో గ్లామర్ బ్యూటీ సమంత స్పెషల్ నెంబర్ లో కనిపించింది. తొలిసారిగా సామ్ ఐటెం సాంగ్ ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా’లో నటించడంతో భారీ రెస్పాన్స్ వచ్చింది. సరికొత్త రికార్డులనూ క్రియేట్ చేసిందీ సాంగ్. ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ఈ సాంగ్ కు క్యాచీ ట్యూన్ అందించారు. సింగర్ మంగ్లీ సోదరి ఇంద్రావతి చౌహౌన్ అద్భుతంగా పాడారు.
మాస్ లిరిక్స్ కు, ఇంద్రావతి చక్కటి గాత్రం అందించడంతో సాంగ్ జనాల్లోకి ఈజీగా దూసుకెళ్లింది. కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ .. సమంత పాట అంటే ఇష్టమని చెప్పాడు. ఇక తాజాగా సల్మన్ కూడా ఆ సాంగ్ తనకు నచ్చిందని తెలియజేశాడు. ఐఫా అవార్డ్స్ వేడుకలో గత ఏడాది విడుదలైన సినిమాల్లో మీలో స్ఫూర్తిని నింపిన బాగా ఇష్టమైన పాట ఏదని ఓ రిపోర్టర్ అడిగిన పాటకు ఊ అంటావా మావ పాట అని సల్మాన్ ఖాన్ బదులిచ్చాడు.

అంతేకాకుండా ఈ పాటలోని కొన్ని లైన్స్‌ను పాడి వినిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. గత నెలలో దుబాయ్ లో ఐఫా వేడుకలో జరిగాయి. ఈ అవార్డు ఫంక్షన్ కు సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలో సల్మాన్ పాట పాడి వినిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
కాగా, సింగర్ ఇద్రావతి చౌహాన్ కు ఈ సాంగ్ పాడినందుకు అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ డిజిటల్ మీడియా గ్రూడ్ బిహైండ్ వుడ్ సంస్థ ఈ ఏడాదితో 19 ఏండ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మే 22న సంస్థ యానివర్సరీ సెలబ్రేషన్స్ ను చెన్నై ఐలాండ్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా 2022లో అత్యధికంగా ప్రజాదరణ పొందిన సినిమాలు, బెస్ట్ యాక్టర్స్, సింగర్స్ కు గోల్డ్ మెడల్ ను ప్రదానం చేశారు. ఈ క్రమంలో ఇంద్రావతి అవార్డ్ అందుకుంది.