Salaar Movie : ‘సలార్’ రిలీజ్ డేట్ కన్ఫామ్.! ఈ డౌట్స్ సంగతేంటి.?
NQ Staff - August 15, 2022 / 04:34 PM IST

Salaar Movie : ‘బాహుబలి’ తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’.. ఇలా వరుస ఫ్లాపులను తన ఖాతాలో వేసుకున్నాడు ప్రబాస్. ఇక, ఇప్పుడు అందరి దృష్టీ ప్రబాస్ నెక్స్‌ట్ మూవీ ‘సలార్’ పైనే. ‘కేజీఎఫ్’ తో ప్యాన్ ఇండియా గుర్తింపు దక్కించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
‘బాహుబలి’ తర్వాత ప్రబాస్ చేసిన, ఒప్పుకుంటున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ ప్రాజెక్టులే. ‘సలార్’ కూడా అంతే. భారీ యాక్షన్ ఎపిసోడ్లు హాలీవుడ్ మేకింగ్‌ని తలపించేలా వుండబోతున్నాయ్ ‘సలార్’లో. వుండాల్సిన మాస్ ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా రంగరించిన సినిమా ‘సలార్’.
ప్యాన్స్ ఆశలన్నీ ‘సలార్’ పైనే.!

Salaar Movie Release On September 23
ఖచ్చితంగా ప్రబాస్ ఈ సినిమాతో హిట్టు కొట్టాల్సిందే.. అనే నమ్మకంతో వున్నారు ప్రబాస్ ఫ్యాన్స్. తాజా అప్‌డేట్ ప్రకారం ఈ సినిమాని వచ్చే ఏడాది సెప్టెంబర్ 23న రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసేసిందట చిత్ర యూనిట్.
అందుకు ఇదిగో సాక్ష్యం అంటూ, రిలీజ్ డేట్ అధికారికంగా అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్‌ని కూడా వదిలింది. ఇంకేముంది. ప్రబాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
అంతా బాగానే వుంది. కానీ, అప్పటికల్లా ‘సలార్’ పూర్తయిపోతుందా.? ప్రస్తుతం సర్జరీల బాధతో ప్రబాస్ రెస్ట్ తీసుకుంటున్నాడు. మరోవైపు షూటింగుల బంద్ అంటూ, అదో అడ్డంకి. అసలే భారీ యాక్షన్ డ్రామా. ఇలాంటి అనేక అనుమానాలు ‘సలార్’ చుట్టూ చక్కర్లు కొడుతున్నాయ్. ఇన్ని అడ్డంకుల్ని దాటి సలార్ అనుకున్న డేట్‌కే ధియేటర్లలో సందడి చేయనుందా.? లెట్స్ వెయిట్ అండ్ సీ.!