Sai Pallavai : చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో లక్షలాది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవి. నటనతో పాటు డ్యాన్స్‌తోను ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడి కాల్షీట్స్ కోసం నిర్మాతలు ఎంత వెయిట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కథా బలం లేకపోతే ఎంత పెద్దటి హీరో సినిమా అయిన నో చెప్పేస్తుంది. ఇటీవల సాయిపల్లవి తన సినిమాను తిరస్కరించిందని చిరంజీవి అన్నారు.
‘లవ్‌స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘భోళా శంకర్’ సినిమాలో నాకు చెల్లెలిగా సాయిపల్లవిని అడిగితే ముందు ఆమె తిరస్కరించిందని, అయితే ఆమె నో చెప్పడం తనకు ఎంతో సంతోషం కలిగిందని పేర్కొన్నారు. సాయి పల్లవి డ్యాన్స్ ఎంతో అద్భుతంగా చేస్తుంది. అలాంటి అమ్మాయితో డ్యాన్స్ స్టెప్పులేయాలను కుంటా తప్పా అన్నయ్యా అని పిలిపించు కోవాలనుకోలేదు’ అంటూ చమత్కరించారు.
చిరంజీవి సినిమాకి నో చెప్పిన సాయి పల్లవి ఇప్పుడు కమల్ హాసన్ సినిమాలో నటిస్తుందనే వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి నటించేది కమల్ హాసన్ సినిమాలో అయినా.. కోలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన శివ కార్తికేయన్ జంటగా సాయిపల్లవి నటిస్తుంది. ఈ సినిమాకు కమల్ హాసన్ నిర్మాత మాత్రమే అని తెలుస్తోంది.

యంగ్ స్టార్ శివకార్తికేయన్ తమిళ్ లో ఇప్పుడు మాంచి జోష్ తో ఉన్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఆయన ముందుకు దూసుకుపోతున్నాడు. తాజాగా ఒక సినిమా చేయడానికి ఆయన రంగంలోకి దిగారు. సోనీ పిక్చర్స్ తో కలిసి కమల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘మావీరన్’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.
- Advertisement -

చిత్రంలో శివ కార్తికేయన్ .. ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తాడట. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు సాయిపల్లవిని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ వార్తలపై క్లారిటీ రావలసి ఉంది.