Sai Pallavi And Rana : లవ్ లెటర్ రాసిన సాయి పల్లవి.. పిచ్చి కొట్టుడు కొట్టిన పేరెంట్స్
NQ Staff - July 11, 2022 / 02:24 PM IST

Sai Pallavi And Rana : టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో సాయి పల్లవి ఒకరు. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయిన తనదైన నటన, డ్యాన్స్‌లో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ చేత లేడీ పవర్ స్టార్‌గా పిలుపించుకుంది సాయి పల్లవి. ఇదిలా ఉంటే ఇటీవల ఆమె నటించిన విరాట పర్వం మంచి విజయం అందుకుంది.
అడ్డంగా బుక్ అయిందా?
సక్సెస్ ఫెయిల్యూర్స్‌కు అతీతంగా సినిమాలు చేసే సాయి పల్లవి జూలై 15న గార్గి అనే చిత్రంతో సందడి చేయడానికి సిద్ధమైంది. ‘గార్గి’ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో సాయి పల్లవి బిజీగా ఉంది. ఇందులో ఈమె ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేసింది. ఓ సందర్బంలో ఆమెను తల్లిదండ్రులు బాగా కొట్టారట. ఈ విషయాన్ని ప్రమోషనల్ కార్యక్రమంలో తెలియజేసింది.

Sai Pallavi Rana Participated Village Show Launched Netflix
రీసెంట్గా ప్రముఖ డిజిటల్ ఛానెల్ నెట్‌ఫ్లిక్స్ ప్రారంభించిన విలేజ్ షో అనే టాక్ షోలో సాయి పల్లవి పాల్గొంది. ఆ టాక్ షోను గంగవ్వ నిర్వహిస్తోంది. అందులో రానా దగ్గుబాటి కూడా పాల్గొన్నారు. విరాట పర్వంలో రవన్న పాత్రకు నువ్వు లవ్ లెటర్ రాశావు కదా, రియల్ లైఫ్‌లో ఎవరికైనా లవ్ లెటర్ రాశావా అని గంగవ్వ సాయి పల్లవిని అడిగింది.
దానికి సాయి పల్లవి మాట్లాడుతూ ‘‘నేను ఏడవ తరగతిలో ఉన్నప్పుడు ఓ అబ్బాయికి లవ్ లెటర్ రాశాను. ఆ లెటర్‌ను నా పేరెంట్స్ చూశారు. నన్ను చాలా బాగా కొట్టారు’’ అని చెప్పింది. ‘గార్గి’ సినిమాలో తండ్రి కోసం ఆరాటపడే టీచర్ అయిన కూతురు పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది. ఈ చిత్రాన్ని తెలుగులో రానా దగ్గుబాటి విడుదల చేస్తున్నారు.
గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న గార్గి చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే సాయి పల్లవి బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, మేకింగ్ వీడియోలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. మహిళా ప్రధాన చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతుంది.