Jai Balayya : ‘జై బాలయ్య’ కోసం రాములమ్మని కాపీ కొట్టేసిన తమన్.!
NQ Staff - November 25, 2022 / 03:40 PM IST

Jai Balayya : ఏంటి బాసూ మరీనూ.? మా బాలయ్య కోసం మంచి పాట చెయ్యాల్సింది పోయి, రాములమ్మ పాటని దించేస్తావా.? అంటూ సంగీత దర్శకుడు తమన్ మీద మండిపడుతున్నారు బాలయ్య అభిమానులు.
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘వీర సింహా రెడ్డి’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ బయటకు వచ్చింది.
ఇలా పాట వచ్చిందో లేదో, అలా ఆ పాటకి సంబంధించి గతంలో వచ్చిన పాటల తాలూకు రిఫరెన్సులు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయ్.
రాములమ్మ.. శ్రీమంతుడు..
‘వచ్చాడయ్యో సామీ..’ అంటూ సాగే ‘శ్రీమంతుడు’ సినిమాలోని పాటని కూడా వాడేసి, ‘జై బాలయ్య’ పాటలో దించేశాడు తమన్. ‘జై బాలయ్యా..’ అనే ప్రస్తావన వచ్చినప్పుడు అందరికీ, ‘ఒసెయ్ రాములమ్మ’ పాట గుర్తుకొచ్చింది.
కొన్నాళ్ళ క్రితం తమన్ మీద ‘కాపీ’ ఆరోపణలు వస్తే, తన దగ్గర వున్న గొప్ప సాఫ్ట్‌వేర్‌తో కాపీ ట్యూన్స్ కనిపెట్టెయ్యొచ్చనీ, దాన్ని వాడుతున్న తాను కాపీ కొట్టడం జరగదనీ చెప్పాడు. మరి, ఇదేంటయ్యా తమనూ.. అంటూ, పాత పాటల్నీ, జై బాలయ్య పాటనీ.. లింక్ చేసి చూపిస్తున్నారు.
తమన్ ఈసారేమంటాడో.!