TV9 Anchor Swapna : పెళ్లి పీఠలు ఎక్కిన టీవీ9 స్వప్న

NQ Staff - October 7, 2022 / 01:25 PM IST

TV9 Anchor Swapna  : పెళ్లి పీఠలు ఎక్కిన టీవీ9 స్వప్న

TV9 Anchor Swapna  : రేడియో, దూరదర్శన్, శాటిలైట్ ఛానల్, యూట్యూబ్, సోషల్ మీడియా ఇలా అన్నిచోట్ల కూడా పాపులారిటీని సొంతం చేసుకున్న వ్యక్తుల్లో అరుదైన వ్యక్తి స్వప్న. ఈమె టీవీ9 ద్వారా అత్యధిక పాపులారిటీని సొంతం చేసుకుంది.

ఆ తర్వాత ఎన్నో టీవీ చానల్స్ లో సందడి చేశారు. యూట్యూబ్లో ఆమె యొక్క వీడియోలు రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మతో ఆమె చేసిన ఇంటర్వ్యూలు ఎన్నో కూడా సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి.

సుదీర్ఘమైన మీడియా అనుభవం ఉన్న స్వప్న ఒక ప్రముఖ సెలబ్రిటీ హోదాని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆమె గురించి ఎప్పటికప్పుడు మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి.

తాజాగా ఈవిడ పెళ్లి పీటలు ఎక్కినట్లుగా…

ఎక్కబోతున్నట్లుగా పుకార్లు వస్తున్నాయి. పెళ్లి గురించి వస్తున్న పుకార్ల విషయంలో ఆమె నుండి ఎలాంటి క్లారిటీ లేదు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కి చెందిన ఒక బోర్డు డైరెక్టర్ తో ఆమె వివాహం జరిగిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఆ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఆమె ఏమైనా అధికారికంగా తెలియజేస్తుందేమో చూడాలి. మీడియాలో వస్తున్న వార్తల పట్ల స్వప్న స్పందిస్తారా.. లేదంటే ఆమె సన్నిహితులు ఏమైనా క్లారిటీ ఇస్తారా అనేది కాలమే సమాధానం చెప్పాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us