Ruhani Sharma : ‘చిలసౌ’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ రుహానీ శర్మ. పదహారణాల తెలుగమ్మాయా.? అనేంతలా ఈ సినిమాలో కనిపించింది రుహానీ శర్మ. డీ గ్లామర్ రోల్, సింగిల్ కాస్ట్యూమ్ సినిమా అయిన ఈ సినిమాలో తన సహజ సిద్ధమైన నటనతో కట్టి పడేసింది ఈ నార్త్ బ్యూటీ.
ఆ తర్వాత ‘డర్టీ హరి’ వంటి కొన్ని చిన్నా చితకా సినిమాల్లో నటించిందనుకోండి. అయితే, సోషల్ మీడియాలో మాత్రం అమ్మడి హాట్ అలర్ట్‌కి కుర్రోళ్ల చిన్ని గుండెలకు హార్ట్ ఎటాక్‌లు రావడం పక్కా. అంతలా పాప గ్లామర్ ఫీట్లు చేస్తుంటుంది.

అవునులెండి.. తొలి సినిమా ఇంపాక్ట్‌తో అమ్మడు సాంప్రదాయమైన పాత్రలకి మాత్రమే పనికొస్తుంది.. అనే ఇంపాక్ట్ క్రియేట్ కాకూడదు.. అంటూ, గ్లామర్ యాంగిల్స్ చూపించాలి కదా. అప్పుడే అన్ని రకాలా అవకాశాలు దక్కించుకోవచ్చు. అదే చేస్తోంది రుహానీ శర్మ.
తెలుగమ్మాయి అనిపించుకోవాలనే తాపత్రయం.
- Advertisement -
.బికినీ యాంగిల్ వరకూ అన్నిగ్లామర్ షేడ్స్ చూపించేసింది. ఏమాటకామాటే చెప్పుకోవాలి. రుహానీ శర్మ గ్లామర్‌లో సమ్‌థింగ్ డిఫరెంట్ స్టైలింగ్ మిక్స్ అవుతుంటుంది. అందుకే ఆమెకు ఏ కాస్ట్యూమ్ వేసినా ఇట్టే అతికి పోతుంది. వల్గారిటీ వుండదు కానీ, కావల్సినంత గ్లామర్ పుష్కలంగా ఒలకబోసేస్తుంటుంది.

బేసిగ్గా నార్త్ ఇండియన్ ముద్దుగుమ్మ అయినప్పటికీ అచ్చమైన తెలుగమ్మాయిలా గుర్తింపు తెచ్చుకోవాలని వుందని రుహానీ శర్మ చెబుతోంది. మొదట్లో తెలుగు అస్సలు అర్ధమయ్యేది కాదట. చాలా కష్టం అనుకుందట. కానీ, ఇఫ్పుడిప్పుడే కొద్దిగా తెలుగులో మాట్లాడడం, అర్ధం చేసుకోవడం చేస్తోందట. త్వరలోనే తెలుగు చక్కగా మాట్లాడతానని చెబుతోంది రుహానీ శర్మ.