RRR Movie : జపాన్ లో ‘ఆర్ఆర్‌ఆర్‌’ సినిమా అసలు లెక్కలు ఇవే

NQ Staff - October 30, 2022 / 09:03 AM IST

RRR Movie : జపాన్ లో ‘ఆర్ఆర్‌ఆర్‌’ సినిమా అసలు లెక్కలు ఇవే

RRR Movie : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని 1000 కోట్లకు పైగా వసూళ్లను నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల జపాన్ లో ఈ సినిమా విడుదల అయింది.

రాజమౌళితో పాటు ఇద్దరు హీరోలు చిత్ర యూనిట్ సభ్యులు జపాన్ వెళ్లి మరీ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జపాన్ లో ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ నమోదు చేయలేక పోయింది అంటూ చాలా మంది మాట్లాడుకుంటున్నారు.

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మొదటి వారంలో ఈ సినిమా దాదాపుగా హాఫ్ మిలియన్ డాలర్ల కలెక్షన్స్ ని నమోదు చేసింది. ఈ మొత్తం కాస్త తక్కువే అయినా కూడా ఒక ఇండియన్ సినిమా జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద సాధించిన కలెక్షన్స్ తో పోలిస్తే ఎక్కువే అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

సూపర్ స్టార్‌ రజనీకాంత్ నటించిన ముత్తు సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుని జపాన్లో అత్యధిక కలెక్షన్స్ ని రాబట్టింది. ఆ స్థాయిలో ఈ సినిమా రాబట్టిందా లేదా అనేది మరికొన్నాళ్ళకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

జక్కన్న దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ మరియు అల్లూరి పాత్రలో రామ్‌ చరణ్ లు కనిపించారు. ఆలియా భట్ తో పాటు ఇంకా పలువురు నటీ నటులు ఈ సినిమాలో కనిపించడం జరిగింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us