RRR : త్రిబులార్ ఆస్కార్ బరిలో కూడా నిలిచే ఆస్కారం లేని చిత్రమా?

NQ Staff - September 21, 2022 / 02:05 PM IST

159852RRR : త్రిబులార్ ఆస్కార్ బరిలో కూడా నిలిచే ఆస్కారం లేని చిత్రమా?

RRR: ఆస్కార్ కి అత్యంత చేరువలో త్రిబులార్, జక్కన్న చిత్రానికి అత్యున్నత పురస్కారం! ఇలా కొన్నాళ్లుగా సోషల్మీడియాలో, ఛానెల్స్‌ లో విపరీతమైన ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దాంతో త్రిబులార్ ఆస్కార్ బరిలో నిలుస్తుందనీ, తప్ప కుండా అకాడమీ అవార్డు వరిస్తుందనీ ఆశపడ్డారంతా. తెలుగు సినిమా స్థాయి మరింత పెరగ నుందనీ, టాలీవుడ్ మూవీకి సారా దునియా సాహో అంటుందని ఊహించారంతా.

ఎన్టీఆర్‌ కి కూడా అవార్డు దాదాపు ఖరారే

RRR Could Not Stand In Oscar Ring

RRR Could Not Stand In Oscar Ring

అన్నట్టుగా హలీవుడ్ వెబ్ సైట్స్‌ కూడా వార్తలు రాసేయడంతో భీమ్ కి సలామ్ కొడుతుంది సినిమా ప్రపంచం అనుకున్నారంతా. కానీ ఆస్కార్ కలలన్నీ ఆఖరికి ఆవిరైపోయాయి. ఇండియన్ బాక్సాఫీస్‌ ని షేక్ చేసి సూపర్ సక్సెసయిన త్రిబులార్ అకాడమీ ఆశల్లో మాత్రం గెలవలేకపోయింది.

ఎవరూ ఊహించని విధంగా గుజరాతీ చిత్రం చెల్లో షో(లాస్ట్ ఫిలిం షో) బెస్ట్ ఫారిన్ ఫిల్మ్‌ క్యాటగిరీలో అధికారికంగా ఎంపికయింది. అయితే గుజరాతీ సినిమాని అఫీషియల్ గా సెలక్ట్ చేయడం వెనక కూడా చాలా రకాల కథనాలు వినిపిస్తున్నాయి. FFI(ఫిల్మ్‌ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) తీసుకున్న ఈ నిర్ణయం వెనక పొలిటికల్ ఈక్వేషన్స్‌ కూడా ఉన్నాయన్న రూమర్స్ ఊపందుకున్నాయి. మరోవైపు చెల్లో షో మూవీ పై వివాదాలు కూడా మొదలైపోయాయి. 1988 లో ఆస్కార్ అవార్డు సాధించిన సినిమా ప్యారడైసో కి ఇది రీమేక్ అన్న టాక్ సోషల్మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆస్కార్ వరించిన సినిమాకీ రీమేక్ గా తీసిన మూవీని మళ్లీ ఆస్కార్ అవార్డు బరిలో నిలుపుతున్నారా అంటూ ఫిల్మ్‌ ఫెడరేషన్ పై కామెంట్స్‌ చేస్తున్నారు మూవీ లవర్స్.

పారాసైట్ చూసి పడుకున్నా అని రాజమౌళి గతంలో ఓ ఇంటర్ వ్యూలో చెప్పినందుకు.. ఇప్పుడు త్రిబులార్ ని మేం పడుకోబెట్టాం అని జ్యూరీ మెంబర్స్‌ వెర్షన్ లా మీమ్స్‌ కూడా స్టార్టయి పోయాయి. అంతలా నెగిటివ్ రెస్పాన్స్‌ ని దక్కించు కుంటోంది FFI జ్యూరీ. సరిగ్గా ఇక్కడే సౌత్ సినిమాల మీద ముఖ్యంగా తెలుగు చిత్రాల మీద ఉన్న చిన్నచూపు అంశం మరో సారి తెరపైకొచ్చి ఇక్కడి ఇండస్ట్రీల్లో హాట్ టాపికైంది. కంటెంట్ అండ్ క్యాలిబర్ ఉన్నా కూడా మన సినిమాలంటే అవార్డులకు అర్హత ఉందా అన్నట్టుగా ట్రీట్ చేయడం అనాదిగా సాగుతోంది.

RRR Could Not Stand In Oscar Ring

RRR Could Not Stand In Oscar Ring

గత దశాబ్ధకాలంగా మన దేశం నుంచి అకాడమీ అవార్డుకు సబ్మిట్ చేసిన సౌత్ సినిమాల లిస్ట్ చూసుకుంటే.. 2011 లో అబు, సన్ ఆఫ్ ఆడమ్ అనే మళయాళం సినిమా, 2016 లో వెట్రిమారన్ డైరెక్షన్లో వచ్చిన ‘విశారణై’ మూవీ, 2020 లో వచ్చిన మళయాళం మూవీ జల్లికట్టు, 2021 లో తమిళ్ మూవీ ‘పెబ్లెస్’ బెస్ట్ ఫారిన్ ఫిల్మ్‌ క్యాటగిరీలో సబ్మిటయ్యాయి. కానీ ఇవేవీ ఫైనల్ గా ఆస్కార్ పోటీకి నామినేట్ అవలేకపోయాయి. ఇక తాజాగా దేశ విదేశాల్లో లెజెండరీ డైరెక్టర్స్‌, గ్రేటెస్ట్ ఫిల్మ్‌ మేకర్స్‌ చేత ప్రశంసలందుకున్న త్రిబులార్‌ బరిలో నిలిచి ఉత్తమ విదేశీ చిత్రంగా అవార్డును సంపాదిస్తుందని అనుకుంటే అసలు సబ్మిషన్ కే నోచుకోలేదు. ఇదేం లాజిక్కో మరి?

ఓవైపు హాలీవుడ్‌ వెల్ నోన్ వెబ్ సైట్స్‌ కూడా త్రిబులార్ కి ఆస్కార్ దక్కే స్కోప్ ఉందంటూ పాజిటివ్ గా వార్తలు రాస్తే ఇక్కడ మాత్రం అసలే పారామీటర్స్‌ ని బేస్ చేసుకుని మరి రిజెక్ట్‌ చేశారో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆడియెన్స్‌. కొన్నేళ్ల క్రితం నేషనల్ అవార్డ్స్ విషయంలోనూ తెలుగు సినిమా పరిస్థితి పెద్ద గొప్పగా ఏమీ ఉండేది కాదు. పురస్కారాలకి ఆస్కారమే లేనట్టు, ఎప్పుడో ఒకటో రెండో వస్తేనే గ్రేట్ అన్నట్టుగా ట్రీట్ చేసేవాళ్లు. కానీ కొన్ని సంవత్సరాలుగా ఆ పరిస్థితి చాలావరకు మారింది. చాలా కేటగిరీల్లో జాతీయ అవార్డులు దక్కించుకుని సత్తా చాటుతున్నాయి. మరి ఆస్కార్ పోటీ ఎంపికలో, అకాడమీ కి సబ్మిషన్లో ఈ సిచ్యుయేషన్ ఇంకెన్నాళ్లకు మారుతుందో,
టాలీవుడ్ సినిమాకి ఆస్కార్ పురస్కారం ఇంకెంత దూరంలో ఉందో చూడాలి మరి.