Robo Shankar Gets Impatient With Hansika Motwani : హన్సికకు పొగరు.. నన్ను ముట్టుకోవడానికి కూడా ఒప్పుకోలేదు.. నటుడి సంచలన కామెంట్లు..!

NQ Staff - July 4, 2023 / 10:39 AM IST

Robo Shankar Gets Impatient With Hansika Motwani : హన్సికకు పొగరు.. నన్ను ముట్టుకోవడానికి కూడా ఒప్పుకోలేదు.. నటుడి సంచలన కామెంట్లు..!

Robo Shankar Gets Impatient With Hansika Motwani :

అప్పుడప్పుడు హీరోయిన్లు చేసే కొన్ని పనులు తీవ్ర విమర్శలకు తావిస్తుంటాయి. తమ అభిమానులతో, తోటి నటీనటులతో ప్రవర్తించే తీరు వారిని తప్పుదోవ పట్టిస్తుంటాయి. చివరకు వారే నవ్వుల పాలు కావాల్సి వస్తోంది. ఇప్పుడు యాపిల్ బ్యూటీ హన్సిక కూడా ఇలాంటి పనే చేసింది. ఆమె పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాల్లో నటిస్తోంది.

ఇక తాజాగా ఆమె నటుడు ఆదితో కలిసి నటించిన మూవీ పార్ట్ నర్. ఈ మూవీలో రోబో శంకర్ కీలక పాత్రలో నటించాడు. ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రోబో శంకర్ మాట్లాడుతూ.. హన్సిక మీద అసహనం వ్యక్తం చేశాడు. హన్సిక ఈ సినిమాలో నాతో కలిసి నటించేటప్పుడు కాస్త పొగరు చూపించింది.

అలా చెప్పేసరికి..

ఆమె నా కాలు తాకడానికి ఒప్పుకోలేదు. కనీసం నన్ను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. డైరెక్టర్ ఎంత చెప్పినా ఆమె వినలేదు. దాంతో సెట్ లో ఉన్న వాళ్లం అందరం ఆశ్చర్యపోయాం అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాటలతో స్టేజిపై ఉన్న వారంతా షాక్ అయ్యారు. ఇక ఆయన మాటలపై ఓ లేడీ జర్నలిస్ట్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

Robo Shankar Gets Impatient With Hansika Motwani

Robo Shankar Gets Impatient With Hansika Motwani

వాస్తవానికి రోబో శంకర్ కు జాండీస్ ఉంది. మానసిక పరిస్థితి కూడా బాగోలేదని కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చినట్లు సమాచారం. మరి అందుకే హన్సిక అతన్ని ముట్టుకోవడానికి ఇష్టపడలేదేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా హన్సిక చేసిన పని మాత్రం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఎంత పెద్ద హీరోయిన్ అయితే మాత్రం అంత పొగరా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us