Ritika Singh : 32 రోజులు స్నానం చేయకుండా కారులో ఆ పని చేశా.. హీరోయిన్ సంచలన కామెంట్లు..!
NQ Staff - February 27, 2023 / 10:55 AM IST

Ritika Singh : సినిమా రంగంలో రాణించాలంటే కొన్ని సార్లు రియలస్టిక్ గా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎంత వీఎఫ్ ఎక్స్ లాంటివి వచ్చినా సరే కొన్ని సార్లు పాత్రకు తగ్గట్టు చేయాలంటే తమ బాడీని పూర్తిగా మార్చుకోవాల్సి వస్తుంది. చాలామంది గతంలో ఇలాంటి పని చేసి ఆ పాత్రలకు ప్రాణం పోశారు. ఇప్పుడు హీరోయిన్ రితికా సింగ్ కూడా ఇదే పని చేసింది.
ఆమె గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. వెంకటేశ్ హీరోగా వచ్చిన గురూ సినిమాలో ఆమె నటించి మెప్పించింది. ఈ మూవీ తర్వాత ఆమె ఎక్కువగా తెలుగు, తమిళ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. ఇక తాజాగా ఆమె నటించిన మూవీ ఇన్ కార్.
మూవీ ప్రమోషన్ లో..
ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హర్ష్ వర్ధన్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా రితికా సింగ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆమె మాట్లాడుతూ.. ఈ మూవీ కోసం 32 రోజులు తల స్నానం చేయకుండా ఉన్నాను.
ఈ మూవీలో అత్యాచారానికి ముందు, ఆ తర్వాత అనే అంశాలను చూపించబోతున్నాం. పాత్ర కోసం కారులోనే 32 రోజులు షూటింగ్ చేశాం. ఒకే డ్రెస్ లో షూటింగ్ చేశాను. చాలా రోజులు స్నానం చేయక పోవడంతో తల నుంచి వాసన వచ్చేది. అయినా సరే అలాగే షూటింగ్ చేశాం అంటూ చెప్పుకొచ్చింది రితికా సింగ్. ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.