Rishabh Shetty : కాంతార హీరో సినిమా కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు

NQ Staff - November 6, 2022 / 08:01 PM IST

Rishabh Shetty : కాంతార హీరో సినిమా కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు

Rishabh Shetty : కన్నడ చిత్రం కాంతార ప్రస్తుతం దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ కలెక్షన్స్ నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా దాదాపుగా 350 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

మరి కొన్నాళ్ల పాటు ఈ సినిమా థియేటర్ కొనసాగే అవకాశం ఉంది, కనుక కచ్చితంగా ఈ సినిమా 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసే అవకాశం ఉందని అంటూ చిత్ర యూనిట్ సభ్యులతో పాటు బాక్సాఫీస్ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా కన్నడ బాక్సాఫీసు వద్ద అత్యధిక వసూలు నమోదు చేసిన రెండవ సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమా హీరో కం దర్శకుడు రిషబ్ శెట్టి తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అందరి కీ షాకింగ్ గా ఉన్నాయి.

సినిమా ఇండస్ట్రీకి రావడం కోసం డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్న సమయంలోనే ప్రయత్నాలు మొదలు పెట్టాడట. అప్పటి నుంచి దాదాపు పది సంవత్సరాల పాటు తీవ్రమైన ఇబ్బందులు ఇబ్బందులు ఎదుర్కొన్నారంటూ హీరో రిషబ్ శెట్టి పేర్కొన్నాడు.

ఒకానొక సమయం లో ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఇంట్లో నాన్నని డబ్బులు అడగలేక వాటర్ క్యాన్స్ ఇంటింటికి తిరిగి వేసే వాడినని, అలాగే రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఉద్యోగం చేశానని.. హోటల్స్ లో ఉద్యోగం చేశానని అన్నాడు.

చిన్న చిన్న పనులు చాలానే చేశానని చెప్పుకొచ్చాడు. తాను సినిమాల్లో అవకాశాల కోసం చాలా స్ట్రగుల్ అయ్యాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పించే విధంగా ఉన్నాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ పదేళ్ల కష్టం తీరినట్లు అయ్యిందని రిషబ్‌ శెట్టి అన్నాడు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us