RGV : ద‌ర్శ‌కుడిగా మాత్ర‌మే నా అభిప్రాయం చెప్పేందుకు వ‌చ్చా: రామ్ గోపాల్ వ‌ర్మ‌

RGV : గ‌త కొద్ది రోజులుగా టాలీవుడ్, ఏపీ ప్ర‌భుత్వానికి కోల్డ్ వార్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. టికెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై సినిమా ఇండస్ట్రీ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాదంలోకి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చారు. వారం రోజులుగా హీట్‌ పెంచిన వర్మ, నాని మాటల యుద్ధం ఇప్పుడు ఓ చర్చకు దారితీసింది.

RGV about meeting with minister perni nani
RGV about meeting with minister perni nani

ఆంధ్రప్రదేశ్‌ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మ భేటీ అయ్యారు. ఈ భేటీలో సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై చర్చ జరగనుంది. ఈ భేటీకి ముందు ఆర్జీవీ మాట్లాడుతూ.. తాను ఇక్కడికి సినీ పరిశ్రమ ప్రతినిధిగా వచ్చానని తెలిపారు. తన అభిప్రాయాలు చెప్పేందుకు వచ్చినట్టుగా వెల్లడించారు.

ఇతరుల వ్యాఖ్యలపై తాను స్పందించనని అన్నారు. తాను చెప్పదలిచినది మాత్రమే భేటీలో ప్రస్తావించనున్నట్టుగా వెల్లడించారు. భేటీ తర్వాతే వివరాలు చెప్పగలనని తెలిపారు. అయితే భేటీ ప్రస్తుతం సినీ పరిశ్రమతోపాటు.. ఏపీ రాజకీయా వర్గాల్లో హాట్ టాఫిక్‌గా మారింది.

నాగార్జున వ్యాఖ్యలపై స్పందించను. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారివి , సినిమా టిక్కెట్ల ధరలపై నా అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తాను. ఫైనల్ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది అని రామ్ గోపాల్ వ‌ర్మ అన్నారు. వర్మ సినిమా ఇండస్ట్రీ తరఫున ఏమేమి అంశాలు పేర్ని నాని దగ్గరికి తీసుకోబోతున్నారు? అన్న‌ది చూడాలి.