Renu Desai : మళ్లీ మొదలైన రేణు దేశాయ్ రెండవ పెళ్లి చర్చ
NQ Staff - September 5, 2022 / 04:32 PM IST

Renu Desai : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండవ పెళ్లి గురించి మళ్లీ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. 2018 సంవత్సరంలో ఆమె ఒక వ్యాపార వేత్తతో జీవితాన్ని పంచుకోబోతున్నట్లుగా ప్రకటించింది. అతనితో జరిగిన వివాహ నిశ్చితార్థం కు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.

Renu Desai second marriage again in news
అతడి మొహాన్ని రహస్యం గా ఉంచిన రేణు దేశాయ్ పెళ్లి విషయాన్ని కూడా రహస్యంగా ఉంచిందని ఇద్దరికీ పెళ్లి అయ్యి సంతోషంగా ఉండి ఉంటారని అంతా అనుకున్నారు. కానీ ఆమె పెళ్లి జరగనే లేదు అంటూ ఆమె సన్నిహితులు అంటున్నారు.
అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ అభిమానులు రేణు దేశాయ్ రెండవ పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమె రెండో పెళ్లి చేసుకోవద్దంటూ కొందరు విజ్ఞప్తి చేయగా మరి కొందరు హెచ్చరించారు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ రేణు దేశాయ్ పెళ్లి గురించిన చర్చ మొదలైంది.
పెళ్లి అయ్యుంటే మళ్ళీ ఇప్పుడు ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నానంటూ సోషల్ మీడియాలో చెప్పుకోవాల్సిన అవసరమేంటి.. కనుక ఆమె అప్పుడు పెళ్లి చేసుకోలేదు, ఇప్పుడు పెళ్లి కోసం మళ్లీ ఎదురు చూస్తుంది అంటూ కొందరు ఆమెను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు.
మరి కొందరు మాత్రం ఆమె ఇప్పుడు మళ్లీ రెండో పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నట్లుగా ఆమె తాజా పోస్టులను చూస్తుంటే అనిపిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రేణు దేశాయ్ రెండో పెళ్లి కి హడావుడి మళ్లీ మొదలైనట్లుగానే అనిపిస్తుంది.