Pawan Kalyan And Renu Desai : పవన్‌ మాటలు అబద్దమా? రేణు దేశాయ్‌ అబద్దమా?

NQ Staff - October 23, 2022 / 03:41 PM IST

Pawan Kalyan And  Renu Desai  : పవన్‌ మాటలు అబద్దమా? రేణు దేశాయ్‌ అబద్దమా?

Pawan Kalyan And Renu Desai  : పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడి పోయిన విషయం తెలిసిందే. ఇద్దరు అధికారికంగా విడాకులు తీసుకున్నారు. విడాకుల సమయం లో పవన్ కళ్యాణ్ నుండి రేణు దేశాయ్ కి కోట్ల రూపాయల భరణం అందింది మరియు పెద్ద మొత్తంలో ఆస్తులు కూడా ఆమె పొందింది అంటూ మీడియాలో మరియు మెగా ఫాన్స్ లో విపరీతమైన చర్చ జరిగింది.

ఇన్నాళ్లు ఆ విషయమై పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఇటీవల వైకాపా నాయకులు పెద్ద ఎత్తున మూడు పెళ్లిళ్లు అంటూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తాను రెండో భార్యకు పెద్ద మొత్తంలో భరణం ఇచ్చి విడాకులు తీసుకున్నాను అన్నట్లుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశాడు.

దాంతో పవన్ కళ్యాణ్ నుండి రేణు దేశాయ్ కి భారీ మొత్తంలో భరణం దక్కింది అంటూ క్లారిటీ వచ్చేసింది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం రాధాకృష్ణ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ మాట్లాడుతూ తాను పవన్ కళ్యాణ్ నుండి విడిపోయిన సమయంలో ఒక్క రూపాయి కూడా భరణం తీసుకోలేదు అంటూ దేవుడిపై ప్రమాణానికి కూడా సిద్ధమైంది.

తనను కొందరు అవమానించే విధంగా మాట్లాడుతున్నారని తాను చిన్న వయసు నుండే నటించడం వల్ల చాలా డబ్బు సంపాదించానని, తనకు పవన్ కళ్యాణ్ నుండి డబ్బు అవసరం లేదు అన్నట్లుగా రేణు దేశాయ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాను భారీ ఎత్తున భరణం ఇచ్చినట్లుగా పేర్కొన్నాడు. ఇంతకు ఇద్దరిలో ఎవరు నిజం చెబుతున్నారు? ఎవరు అబద్ధం చెప్తున్నారు? అంటూ సాధారణ జనాలు జుట్టు పీక్కుంటున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us