Sunny Leone : ‘జిన్నా’ కోసం రేణుకలా మారిన సన్నీలియోన్.!

NQ Staff - August 10, 2022 / 03:51 PM IST

Sunny Leone  : ‘జిన్నా’ కోసం రేణుకలా మారిన సన్నీలియోన్.!

Sunny Leone  : బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ తెలుగులో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే ‘జిన్నా’. మంచు వారబ్బాయ్ విష్ణు వర్ధన్ హీరోగా రూపొందుతోన్న సినిమా ఇది. పక్కా ఎంటర్‌టైనింగ్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాలో సన్నీలియోన్ పాత్ర చాలా కీలకమైనదట.

తాజాగా ఈ సినిమాలో సన్నీలియోన్ పాత్రను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ వదిలింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లో సన్నీలియోన్ బస్‌లోంచి దిగుతూ, అల్ర్టా మోడ్రన్ లుక్స్‌లో తన మార్క్ గ్లామరస్‌గా కనిపిస్తోంది. సన్నీలియోన్ పాత్ర పేరు ‘రేణుక’ గా పోస్టర్‌పై పరిచయం చేశారు.

ట్విస్ట్‌ల మీద ట్విస్టులు..

 Released Poster Revealing Sunny Leone Role

Released Poster Revealing Sunny Leone Role

ఇక ఈ పోస్టర్‌ని రిలీజ్ చేస్తూ, తన పాత్ర వివరాలు చెప్పుకొచ్చింది సన్నీలియోన్. ఈ సినిమాలో మంచు విష్ణుకి చిన్ననాటి స్నేహితురాలి పాత్రలో సన్నీలియోన్ నటిస్తోందట. ఈ పాత్రలో చాలా వేరియేషన్స్ వుంటాయట. ఎవరూ ఊహించలేని మలుపులుంటాయనీ సన్నీలియోన్ చెప్పుకొచ్చింది.

ఈ సినిమా అనుకున్నప్పటి నుంచీ మంచు విష్ణుతో కలిసి రకరకాలుగా ప్రమోట్ చేస్తూనే వుంది సన్నీలియోన్. ట్రెడిషనల్ లుక్స్‌లో కనిపించి సందడి చేసిన సన్నీలియోన్, ఈ సారి మోడ్రన్ లుక్‌లో హాట్‌గా కనిపించి ఆడియన్స్‌కి షాకిచ్చింది. ఈ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
కాగా, ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us