Aishwarya Rai : ఇది మీకు తెలుసా.? ఆ పువ్వు పేరు ఐశ్వర్యా.!

NQ Staff - November 1, 2022 / 07:07 PM IST

Aishwarya Rai : ఇది మీకు తెలుసా.? ఆ పువ్వు పేరు ఐశ్వర్యా.!

Aishwarya Rai : అదేంటీ.? పువ్వు పేరు ‘ఐశ్వర్య’ ఏంటీ అనుకుంటున్నారా.? ఏం.! పువ్వులకు పేర్లుండవా.? అదీ హీరోయిన్ పేర్లయితే తప్పేంటంటా.!

మల్లి, జాజి, మందారం, గులాబి, చామంతి.. ఇలా పువ్వులకు ప్రత్యేకమైన పేర్లుండడం మనకి తెలిసిందే. కానీ, ఆ గార్డెన్‌లో పూలకు మాత్రం హీరోయిన్ల పేర్లు పెట్టి పిలుస్తుంటారు ఎంతో ప్రేమగా.

వావ్.! ఎంతందంగా వుంటావే పువ్వా నువ్వు.!

అవునా.! ఎక్కడుంది ఆ హీరోయిన్ల పేర్లతో పిలవబడే గార్డెన్.? నెదర్లాండ్స్‌లో వుందండోయ్. అదో తులిప్ గార్డెన్. తులిప్ గార్డెన్ అంటేనే ఆ అందం, ఆ ప్రెజెన్స్.. అబ్బో ఆ కిక్కే వేరప్పా.

అందుకే, ఆ కిక్కు మరింత పెంచేందుకు, ఆ గార్డెన్‌లోని రకరకాల తులిప్స్‌కి హీరోయిన్స్ పేర్లు పెట్టి పిలుస్తుంటారు. గతంలోనూ త్రిష తదితర ముద్దుగుమ్మల పేర్లు కొన్ని తులిప్ జాతులు సొంతం చేసుకున్నాయ్.

తాజాగా అందాల రాశి ఐశ్వర్య రాయ్ పేరును ఓ తులిప్ రకం సొంతం చేసుకుంది. ఆ రకం తులిప్‌కి ఐశ్వర్యరాయ్ పేరు పెట్టారట. క్యూకెన్‌హోప్ అనే ఈ గార్డెన్ నెదర్లాండ్స్‌లో వుంది. ‘ఐశ్వర్య’ అనే పేరున్న రకం అందమైన తులిప్స్‌ని ఈ గార్డెన్‌లో వీక్షించొచ్చన్నమాట.

ఐశ్వర్యా రాయ్ అంటేనే అందానికి కేరాఫ్ అడ్రస్. అలాంటిది ఆమె పేరుతో వున్న తులిప్ పువ్వు అంటే, అది ఇంకెంత అందంగా వుంటుందో కదా.! చూడాలంటే నెదర్లాండ్స్ వెళ్లాల్సిందేనండోయ్.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us