Ravindra Jadeja : పుష్ప ట్రాన్స్‌లో ర‌వీంద్ర జ‌డేజా.. లుక్ కేక పెట్టిస్తుందిగా..!

Ravindra Jadeja : ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసిన పుష్ప ర‌చ్చ న‌డుస్తుంది. ఈ సినిమా సౌత్ టూ నార్త్ అద‌ర‌గొడుతుంది. ముఖ్యంగా క్రికెట‌ర్స్ ఈ సినిమాపై మ‌క్కువ ఎక్కువ చూపిస్తున్నారు. తెలుగు ఆట‌గాడు హ‌నుమ విహారి ఇటీవ‌ల త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా సినిమా చూస్తున్నంత సేపు తామంత పుష్ప ట్రాన్స్‌లోనే ఉన్నామ‌ని ట్వీట్‌లో చెప్పాడు. విల‌క్ష‌ణ న‌టుడు అల్లు అర్జున్, పుష్ప చిత్ర బృందానికి ఈ సంద‌ర్భంగా భార‌త ఆట‌గాళ్లు అభినంద‌న‌లు తెలిపారు.

Ravindra Jadeja allu arjun Pushpa dialogue
Ravindra Jadeja allu arjun Pushpa dialogue

పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ఎంత పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అనేక మంది ఈ డైలాగ్ చెప్పి ఆక‌ట్టుకున్నారు. టీమిండియా ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాతోపాటు ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్, శిఖ‌ర్ ధావ‌న్ పుష్ప డైలాగ్‌తో ఆక‌ట్టుకున్నారు. ఇద్ద‌రు కూడా డైలాగ్ ప్లే అవుతుంటే దానికి తగ్గ‌ట్టుగా లిప్స్ క‌దిలిస్తూ, అచ్చం అల్లు అర్జున్ హ‌వాభావాల‌తో ఆక‌ట్టుకున్నారు. ఈ వీడియోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయ‌గా అభిమానులు ప్ర‌శంస‌లు కురిపించారు.

ఆ మ‌ధ్య వీడియోతో పుష్ప ట్రాన్స్‌లోకి వెళ్లిన జ‌డేజా ఇప్పుడు స‌రికొత్త లుక్‌తో ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇచ్చాడు. మాసిన గెడ్డంతో పుష్పరాజ్ లుక్‌లో జడేజా కనిపిస్తున్నాడు. పుష్ప రాజ్‌గా రగ్డ్ లుక్‌‌లో జడేజాను చూసి.. నెటిజన్స్ సర్‌ప్రైజ్ అవుతున్నారు. గాయం కారణంగా సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌కి ఎంపికవని రవీంద్ర జడేజా.. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో సాధన చేస్తున్నాడు.

నోట్లో చుట్ట‌ పెట్టి సీరియ‌స్ లుక్స్ చూస్తున్న జ‌డేజా ఇది గ్రాఫిక‌ల్ వ‌ర్క్. ఎవ‌రు కూడా పొగాకు కాల్చ‌రాదు అని సూక్తులు కూడా చెప్పాడు. ఏదేమైన జడేజా లుక్ అదిరిపోయింద‌నే చెప్పాలి. ఇక ఎక్కడ చూసిన ఇప్పుడు పుష్ప సినిమా మేనియా నడుస్తోంది. బన్ని- సుకుమార్‌ కాంబినేషన్‌లో ప్యాన్‌ ఇండియా సినిమాగా వచ్చిన ”పుష్ప: ది రైజ్‌” సినిమాకు యావరేజ్‌ టాక్‌ వచ్చినప్పటికి కలెక్షన్లు మాత్రం దుమ్ముదులుపుతుంది. టాలీవుడ్‌, బాలీవుడ్‌ అనే తేడా లేకుండా ప్యాన్‌ ఇండియా వ్యాప్తంగా కలెక్షన్లు కొల్లగొడుతుంది.

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా పుష్ప మానియా న‌డుస్తోంది. దేశంలోని ప‌లు భాష‌ల్లో డిసెంబ‌ర్ 17న‌ విడుద‌లైన ఈ చిత్రం అభిమానులను అల‌రిస్తోంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మాణం వ‌హించింది. అల్లు అర్జున్, ర‌ష్మిక మంధాన హిరో, హిరోయిన్లుగా న‌టించారు. దేవి శ్రీ ప్ర‌సాద్ బాణీలు స‌మ‌కూర్చారు. చంద్ర‌బోస్ సాహిత్యం అందించారు. స‌మంత ఐటమ్ సాంగ్‌లో మెరిసింది. రెండు పార్టులుగా తెర‌కెక్కిన ఈ చిత్రం మొద‌టి పార్ట్ మాత్ర‌మే ఇప్పుడు విడుద‌లైంది. రెండో పార్ట్ త‌ర్వాత విడుద‌ల చేయ‌నున్నారు.