Rashmika Mandanna : తగ్గేదే లే.! క్లీవేజ్ ‘షో’తో మతులు పోగొడుతున్న రష్మిక.!
NQ Staff - September 25, 2022 / 04:50 PM IST

Rashmika Mandanna : బాలీవుడ్‌కి వెళ్ళాక రోజు రోజుకీ కన్నడ కస్తూరి రష్మిక మండన్న గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతోంది. ముంబై భామలకు ధీటుగా అందాల విందు చేయడానికి అలవాటుపడిపోయినట్టుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తోంది రష్మిక.
అసలే రష్మికకి ‘క్రష్మిక’ అనే పేరు కూడా వచ్చేసింది.. అంతలా కుర్రకారు ఆమె పట్ల ‘క్రష్’ ప్రదర్శిస్తున్నారు, అలాగే ఆమె అందాల జాతరలో ‘క్రష్’ అయిపోతున్నారు కూడా.
అభిమానులకు ఆ మాత్రం కిక్ ఇవ్వాలి కదా.?
తాజాగా రష్మిక ఓ జీన్స్ ఔట్‌ఫిట్‌లో సోయగాల జాతర షురూ చేసింది. ఓ బీభత్సమైన ఫొటో సెషన్‌తో కుర్రకారుకి నిద్ర లేకుండా చేసేస్తోంది. డెనిమ్ జీన్స్ ధరించి.. బీభత్సమైన క్లీవేజ్ షో ప్రదర్శించేసింది రష్మిక.
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, రష్మిక సూపర్ స్టైలిష్ లుక్ ముందు, ఆమె బీభత్సమైన అందాల ఆరబోత పెద్ద టాపిక్ కాకుండా పోతోందేమో.!
తెలుగులో ‘పుష్ప ది రూల్’ సినిమా చేస్తోందిప్పుడు రష్మిక. తమిళంలో ‘వారిసు’ చేస్తున్న రష్మికకి హిందీలో అయితే మూడు నాలుగు సినిమాలున్నాయ్.! బాలీవుడ్‌లోకి వెళుతూనే, అక్కడ ఇప్పటికే ఓ మ్యూజిక్ వీడియో కూడా చేసేసింది రష్మిక. ‘టాప్ టక్కర్’ అంటూ రష్మిక దేశం మొత్తాన్నీ ఆ మ్యూజిక్ వీడియోతో ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే.