Rashmi Gautam : జబర్ధస్త్ షోతో బుల్లితెరపై తన సత్తా చాటిన అందాల ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్. పేరుకు ఆమె యాంకర్ అయినప్పటికీ ఆమెకు ఓ స్టార్ హీరోయిన్స్‌కి తగ్గని ఇమేజ్ ఉంది. తన గ్లామర్‌ను నమ్ముకొని సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేద్దాం అని ప్రయత్నించిన రష్మీ గౌతమ్ హీరోయిన్‌గా కాదు కదా.. సైడ్ క్యారెక్టర్స్ కూడా పెద్దగా దక్కలేదు.

ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బుల్లితెర వైపు అడుగులు వేసింది. ఆ సమయంలో రష్మీకి బాగా అవకాశాలు వచ్చాయి. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ డాన్స్ షోలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి పిచ్చేక్కిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

అదిరిపోయే హోస్టింగ్‌తో పాటు ఆకట్టుకునే అందం ఉండడంతో రష్మీ గౌతమ్ మంచి గుర్తింపును అందుకుంది. దీనికి రెట్టింపు స్థాయిలో జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో ఈ అమ్మడు ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో విపరీతమైన క్రేజ్‌ను అందుకుంది. అదే సమయంలో తరచూ అతడితో రొమాన్స్ చేస్తూ ట్రెండ్ అయ్యేది. ఫలితంగా నిత్యం వార్తల్లోనే నిలుస్తోంది.
- Advertisement -

బుల్లితెరపై ప్రోగ్రామ్స్ లో భాగంగా సుడిగాలి సుధీర్, రష్మీలకి చాలా సార్లు పెళ్లి జరిగింది. అయితే అదంతా స్రిప్ట్ లో భాగమే. ఇద్దరూ రొమాంటిక్ డ్యూయెట్లు చేస్తూ అలరిస్తున్నారు. సుధీర్ పై రష్మీ వేసే కామెడీ పంచ్ లు కూడా బాగానే పేలుతుంటాయి. ఇదంతా రష్మీలో ఒక కోణం మాత్రమే. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రష్మీ తన అందచందాలతో మత్తెక్కిస్తుంటుంది.

తాజాగా రష్మీ తనలోని అసలు సిసలైన బ్యూటీ యాంగిల్ ని బయట పెట్టింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, పింక్ శారీలో రష్మీ కాక రేపే అందంతో మతిపోగొడుతోంది. కుందనపు బొమ్మలా ఉన్న రష్మీ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఎప్పుడు కూడా ఓవర్ గ్లామర్ షో చేయని రష్మీ కనిపించి కనిపించని అందాలతో మంత్ర ముగ్ధులని చేస్తుంటుంది. ఈ అమ్మడి పిక్స్ తెగ వైరల్ అవుతుంటాయి.

