Rashmi Gautam : జబర్ధస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రష్మీ గౌతమ్ కూడా ఒకరు. ఈ అందాల ముద్దుగుమ్మ ఒకవైపు బుల్లితెరపై సందడి చేస్తూనే అప్పుడప్పుడు వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటుంది. ఈ అమ్మడు సుధీర్ తో కలసి పండించే కెమిస్ట్రీ ప్రేక్షకులని ఆకట్టుకుంటూ ఉంటుంది. రష్మీ, సుధీర్ లవ్ ఎఫైర్ గురించి ఏళ్ల తరబడి ప్రేక్షకుల్లో చర్చ జరుగుతూనే ఉంది.

రష్మీలో మరో కోణం కూడా దాగి ఉంది. రష్మీ జంతు ప్రేమికురాలు. చాలా సందర్భాల్లో రష్మీ జంతువులపై తన ప్రేమ చాటుకుంది. లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. జంతువులపై హింసాయుత సంఘటనలు ఏమైనా జరిగితే రష్మీ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంది.
గ్లామర్ విషయంలో కూడా రష్మీ కేరింగ్ గా ఉంటుంది. తరచుగా గ్లామరస్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా రష్మీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో ఈ ముద్దుగుమ్మ ఫొటో షూట్ కోసం హోయలు పోతూ కనిపించింది. ఈ వీడియో ఆకట్టుకుంటుంది.
గ్లామర్ హద్దులు దాటకుండా చిరునవ్వులు చిందిస్తూ రష్మీ మెస్మరైజ్ చేస్తోంది. స్టైలిష్ డ్రెస్‌లో ఈ అమ్మడు చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. చిరునవ్వు, కొంటె చూపులతోనే కుర్రాళ్లకు బాణాలు సంధిస్తోంది.
రష్మీ జబర్దస్త్ షోలో అందాల ఆరబోతతో పాపులర్ అయింది. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది.