Rashi Khanna : అప్పుడు టెంప్ట్‌ అయ్యా.. ఆపుకోలేకపోయా.. రాశిఖన్నా మాటలు విన్నారా..!

NQ Staff - January 23, 2023 / 06:13 PM IST

Rashi Khanna : అప్పుడు టెంప్ట్‌ అయ్యా.. ఆపుకోలేకపోయా.. రాశిఖన్నా మాటలు విన్నారా..!

Rashi Khanna : సినిమా రంగంలో రాణించాలని చాలామంది కలలు కంటారు. కానీ అది అందరికీ సాధ్యం అయ్యే పని కాదు. కొందరికి మాత్రమే సాధ్యం అవుతుంది. కొందరు మాత్రమే రాణిస్తూ ఉంటారు. చాలామంది కొన్ని హిట్లు కొట్టిన తర్వాత కూడా ఇండస్ట్రీలో కనిపించుకుండా పోతుంటారు. ఇప్పుడు రాశిఖన్నా పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉంది.

ఆమె తెలుగు నాట మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. చాలానే సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ ఎందుకో స్టార్ ఇమేజ్‌ను మాత్రం సంపాదించుకోలేకపోయింది. కేవలం యావరేజ్‌ హీరోల సరసన మాత్రమే ఛాన్సులు అందుకుంది. కానీ అవి ఆమెకు స్టార్ ఇమేజ్ ను తెచ్చి పెట్టలేకపోయాయి.

తాజా ఇంటర్వ్యూలో..

అయితే ఆమెకు ఇప్పుడు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఈ క్రమంలోనే ఆమె వెబ్ సిరీస్‌ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌ సిరీస్‌తో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఇందులో ఆమె మాట్లాడుతూ.. నాకు ఈ సిరీస్‌ లో యాక్షన్‌ సీన్లు చేయాల్సి వచ్చింది. దాని కోసం మెంటల్‌ గా, స్ట్రాంగ్‌ గా ఉండేందుకు వ్యాయామాలు కూడా చేశాను. కొన్ని సార్లు ఆరు గంటల పాటు జిమ్ లోనే ఉన్నాను. ఏం చేస్తున్నానో, ఎంత చేస్తున్నానో తెలియక ఒళ్లు మర్చిపోయి టెంప్ట్‌ అయిపోయి చేశాను అంటూ షాకింగ్‌ కామెంట్లు చేసింది రాశిఖన్నా.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us