Ranveer Singh : న్యూడ్ ఫొటో షూట్ వ్యవహారం.. నేడు విచారణకు హాజరు కాలేనన్న రణ్వీర్ సింగ్
NQ Staff - August 22, 2022 / 09:15 AM IST

Ranveer Singh : బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూ ఉంటారనే విషయం తెలిసిందే. అప్పుడప్పుడు కాంట్రవర్సీస్‌తో హాట్ టాపిక్‌గా నిలుస్తుంటాడు. ఇటీవల ఓ మ్యాగజైన్ కోసం ఒంటిపై నూలుపోగు లేకుండా న్యూడ్ ఫొటోలకు ఫోజులిచ్చాడు. అవి కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ తర్వాత పలువురు రణ్వీర్ సింగ్‌పై మండిపడ్డారు.

Ranveer Singh photoshoot case
మరో డేట్..
ఫొటోషూట్ నేపథ్యంలో నటుడిపై కేసు సైతం నమోదైంది. మహిళల మనోభావాలను కించపరిచాడంటూ ఓ స్వచ్ఛంద సంస్థ చెంబూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ముంబయికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థతో పాటు మరో మహిళా న్యాయవాది పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. రణ్వీర్ న్యూడ్ ఫొటోలను పోస్ట్ చేయడం ద్వారా మహిళల మనోభావాలను గాయపరిచాడని మండిపడ్డారు.
అతనిపై ఐటీ యాక్ట్ 67ఏతో పాటు 292, 293, 354, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. ఈ క్రమంలో పోలీసులు రణ్ వీర్ కు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22న వాంగ్మూలం నమోదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు రావాలని కోరాడు. అయితే, రణ్వీర్ పోలీసులకు ఎదుట హాజరయ్యేందుకు రెండువారాల సమయం కోరాడు.
వ్యక్తిగత కారణాల వల్ల తాను హాజరు కాలేనని, మరింత గడువు కావాలని రణ్వీర్ సిండ్ కోరడంతో పోలీసులు విచారణకు మరో తేదీని ఖరారు చేసి.. రణ్వీర్ సింగ్‌కు నోటీసులు జారీ చేయనున్నారు. అయితే, ఫొటోషూట్‌పై రణ్‌వీర్‌పై విమర్శలు వెల్లువెత్తగా.. బాలీవుడ్ మాత్రం నటుడికి అండగా నిలిచింది.