Ranveer Singh And Deepika Padukone : కొత్తింట్లోకి అడుగుపెట్టిన దీపికా, రణ్‌వీర్ సింగ్.. ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!
NQ Staff - August 20, 2022 / 03:52 PM IST

Ranveer Singh And Deepika Padukone : బాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో రణ్‌వీర్ సింగ్– దీపికా పదుకొణే జంట ఒకటి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. మరోవైపు తన వర్క్స్‌తోను ఫుల్ బిజీగా ఉంటున్నారు. అయితే ఈ లవ్లీ కపుల్ కొన్నాళ్లుగా కొత్త ఇంటి కోసం ప్లాన్ చేస్తుండగా, ఎట్టకేలకు ఆ ఇంట్లోకి అడుగుపెట్టారు.
కొత్త భవంతి..
ముంబై సముద్ర తీరంలోని అలీబాగ్‌లోని ఇంటిలోకి పూజా కార్యక్రమాలతో గృహ ప్రవేశం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు రణ్‌వీర్. కాగా భవనం మొత్తం 2.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఐదు బెడ్‌రూంలు ఉన్నాయి. ఈ అధునాతన భవంతి ధర రూ.22 కోట్లు అని సమాచారం.

Ranveer Singh Deepika Padukone New Home
కాగా ప్రస్తుతం రణ్‌వీర్, దీపిక ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో నివసిస్తున్నారు. కొత్త ఇంటిని విడిది కేంద్రంగా ఉపయోగించుకోవాలని యోచనలో ఉన్నారు దీపిక దంపతులు.ఇటీవల దీపిక, రణ్‌వీర్‌లు 83 సినిమాలో జంటగా మెరిశారు. పెళ్లి తర్వాత వీరిద్దరు సిల్వర్‌స్ర్కీన్‌ను షేర్ చేసుకున్న మొదటి చిత్రమిదే.
ప్రస్తుతం దీపిక షారుఖ్‌ఖాన్ పఠాన్, హృతిక్ రోషన్ ఫైటర్ చిత్రాలతో బిజీగా ఉంటోంది. అలాగే తెలుగులో ప్రభాస్ సరసన ప్రాజెక్ట్-కెలోనూ నటిస్తోంది. ఇక జయేశ్‌బాయ్ జోర్దార్‌తో నిరాశపర్చిన రణ్‌వీర్ చేతిలో రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ, సర్కస్ తదితర సినిమాలు ఉన్నాయి.