Ranga Ranga Vaibhavanga Movie : మెగా హీరో మూవీ ఓటీటీ అప్డేట్‌.. ఉప్పెన ఫ్యాన్స్ కోసం ఇది!

NQ Staff - September 26, 2022 / 05:57 PM IST

Ranga Ranga Vaibhavanga Movie : మెగా హీరో మూవీ ఓటీటీ అప్డేట్‌.. ఉప్పెన ఫ్యాన్స్ కోసం ఇది!

Ranga Ranga Vaibhavanga Movie  : ఉప్పెన సినిమాతో హీరోగా మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ తేజ్ తాజాగా రంగ రంగ వైభవంగా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కేతిక శర్మ  ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా గిరిశాయ దర్శకత్వం వహించాడు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో

ఆకట్టుకోలేక పోయింది. భారీ అంచనాల నడుమ రూపొంది విడుదలైన రంగ రంగ వైభవంగా సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అవ్వడంతో ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాస్త ఆలస్యంగా ఈ సినిమా స్ట్రీమింగ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్‌ వారు ఈ సినిమాను కొనుగోలు చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 7 లేదంటే అంతకు ముందే సినిమాను స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ అధికారికంగా వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలో వైష్ణవ తేజ్ మరియు కేతిక శర్మల మధ్య రొమాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది, టికెట్లు కొనుగోలు చేసి థియేటర్లకు వెళ్లలేని వారు సినిమాని ఓటీటీలో చూద్దామని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఉప్పెన సినిమా తర్వాత వైష్ణవ తేజ్ నుండి వస్తున్న ప్రతి సినిమాను కూడా ఆయన అభిమానులు చూడ్డానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారని సినీ విశ్లేషకులు అభిప్రాయం చేస్తున్నారు. ఓటీటీలో ఈ సినిమా సక్సెస్ అయితే తప్పకుండా వైష్ణవ్ తేజ్ క్రేజ్‌ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us